హైదరాబాద్: ఆదాయంలో అగ్రస్థానంలో ఉన్నామంటున్న ప్రభుత్వం రైతుల రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ, విద్యార్థుల బోధన రుసుములు ఎందుకు విడుదల చేయడం లేదని నాగం జనార్థన్‌రెడ్డి సర్కారును ప్రశ్నించారు. ఆయన శనివారం మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడారు. రైతులు ప్రైవేటు అప్పులకు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొనడానికి కేసీఆరే బాధ్యుడని ఆరోపించారు. బతుకమ్మ పండుగకు విచ్చలవిడిగా ఖర్చు చేయడం వల్లే నిధులు లేకుండా పోయాయని.. అందువల్లే నగరంలో రోడ్డు వేయలేకపోతున్నారని విమర్శించారు. కేంద్రం విడుదల చేసిన రూ.792 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని వెంటనే రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలను నిందిచడం మాని త్వరితగతిన అభివృద్ధి జరపాలని సూచించారు.