అధికార టీఆర్‌ఎస్‌లో ముసలం పుట్టి చీలిపోవటం ఖాయమని తెలంగాణ బచావో నేత నాగం జనార్దన్‌రెడ్డి హెచ్చరించారు.
హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్‌లో ముసలం పుట్టి చీలిపోవటం ఖాయమని తెలంగాణ బచావో నేత నాగం జనార్దన్‌రెడ్డి హెచ్చరించారు. ఎన్టీఆర్ లాంటి నాయకుడినే దించేసిన చరిత్ర ఉందని నాగం గుర్తు చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించి టీఆర్‌ఎస్‌లో చేరిన వారితో చాలామంది అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.
క్యాబినెట్‌లోని మంత్రులకు చాలామందికి అధికారాలే లేవని చెప్పారు. కృష్ణా జలాల వినియోగం ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజల హక్కు అని తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడితే సహించేది లేదని అన్నారు.