'పథకాలకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా'
హైదరాబాద్ : తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగుంటే చెల్లింపులు ఎందుకు ఆపారని టీఆర్ఎస్ సర్కారుపై బీజేపీ నేత, మాజీ మంత్రి మండిపడ్డారు. నగరంలోని మీడియాతో ఆయన గురువారం మాట్లాడారు. మిషన్ కాకతీయ, మధ్యాహ్న భోజన పథకాలకు కూడా డబ్బులు లేవా అని ఆయన ప్రశ్నించారు. కనీసం రుణమాఫీకి సంబంధించిన ప్రీమియంలు ఎందుకు కట్టడంలేదో తనకు అర్ధం కావడం లేదన్నారు. ప్రజలు కూడా ఈ ప్రభుత్వం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకాలను గురించి మాట్లాడుతూ.. కేవలం రూ. 12 వేల కోట్లతో దాదాపు 46 లక్షల ఎకరాలకు సాగునీరందించవచ్చని పేర్కొన్నారు.