
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులకు కొత్త పాసు పుస్తకాల జారీకి సంబంధించి పెద్ద అవాం తరమే ఎదురైంది. వచ్చే నెల 11న రాష్ట్ర వ్యాప్తం గా రైతులందరికీ కొత్త పాసు పుస్తకాలను అంద జేసే ఆలోచనలో ఉన్న ప్రభుత్వానికి కేంద్ర సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ మెలిక పెట్టింది. గత ఒప్పందం ప్రకారం రూ.200కు ఓ పాసు పుస్తకం ఇవ్వాల్సి ఉండగా, ప్రింటింగ్ ప్రారంభించాల్సిన సమయంలో పాసు పుస్తకానికి రూ.250 ఇవ్వాలని ప్రెస్ అధికారులు పట్టుబట్టినట్టు సమాచారం.
దీంతో పాటు మార్చి 11 కల్లా తాము పాసు పుస్తకాలను ఇవ్వలేమని, ఏప్రిల్ 30 వరకు గడువు కావాలని మెలిక పెట్టారని, అందుకే టెండర్లు రద్ద య్యా యని ప్రభుత్వ వర్గా లు చెబుతున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రింటింగ్ ప్రెస్ తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుని, కొత్త టెండర్లు పిలవాలని ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర సంస్థ నిర్వాకంతో పాసు పుస్తకాల పంపిణీని వాయిదా వేయాల్సి వచ్చిం దని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. సీఎం ఆదేశాలతో రాష్ట్ర టెక్నలాజికల్ సర్వీసెస్ (టీఎస్‌టీఎస్) హుటాహుటిన కొత్త టెండర్ షెడ్యూల్‌ను తయారు చేసింది. దీనిప్రకారం ఈ నెల 23 నుంచి మార్చి 2న మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆన్‌లైన్‌లో బిడ్‌లను స్వీకరిస్తారు. అదేరోజు మధ్యాహ్నం బిడ్‌లు ఓపెన్ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment