
బ్రోకర్లకు తావులేకుండా నియామకాలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షలలో బ్రోకర్లకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. 1422 కొత్త ఏఈ పోస్టులకు సోమవారం నాడు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. నవంబర్ 8వ తేదీన ఈ పోస్టులకు రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. డిసెంబర్లోగా మొత్తం నియామక ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.
అలాగే.. తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కో సిబ్బంది కష్టపడి పని చేస్తున్నారని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని ఆయన కోరారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషిచేస్తోందని జగదీశ్ రెడ్డి చెప్పారు.