tspsc notification
-
TS: జూలై 1న గ్రూప్–4 పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: వరుసగా ఉద్యోగ భర్తీ ప్రకటనలతో రెండు నెలలపాటు హడావుడి చేసిన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇక పరీక్షల నిర్వహణకు ఉపక్రమించింది. ఇటీవలే గ్రూప్–1 మెయిన్ పరీక్ష తేదీలను ఖరారు చేయగా.. అత్యధిక పోస్టులున్న గ్రూప్–4 పరీక్షల తేదీలను గురువారం ప్రకటించింది. ఈ ఏడాది జూలై ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో గ్రూప్–4 పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తామని.. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్–తెలుగు, ఇంగ్లిష్–ఉర్దూలలో ఉంటాయని పేర్కొంది. ఎక్కువ పోస్టులు చూపి.. కొన్ని తగ్గించి.. వివిధ ప్రభుత్వ శాఖల్లో 9,168 గ్రూప్–4 పోస్టులను భర్తీ చేస్తామని గత ఏడాది డిసెంబర్ 1న టీఎస్పీఎస్సీ ప్రకటించింది. దీనికి సంబంధించి డిసెంబర్ 30న పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేసినా.. 8,039 ఖాళీ పోస్టులను మాత్రమే చూపింది. అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. తర్వాత ఈ ఏడాది జనవరి 28న విడుదల చేసిన అనుబంధ నోటిఫికేషన్‌తో మరో 141 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను జత చేసింది. వీటితో కలిపి మొత్తంగా భర్తీ చేసే గ్రూప్–4 పోస్టుల సంఖ్య 8,180కి చేరింది. నేటితో గడువు పూర్తి గ్రూప్–4 పోస్టులకు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు దరఖాస్తు గడువు ముగియనుంది. గురువారం సాయంత్రం వరకు 9 లక్షల మంది దర ఖాస్తు చేసుకున్నారు. అంటే దాదాపు ఒక్కో పోస్టుకు 110 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. రెండు పేపర్లు.. 300 మార్కులు.. గ్రూప్–4 పోస్టుల భర్తీకి రెండు పరీక్షలు ఉంటాయి. ఇందులో జూలై 1న ఉదయం జనరల్ స్టడీస్ పరీక్ష, మధ్యాహ్నం సెక్రటేరియల్ ఎబిలిటీ పరీక్షను నిర్వహించనున్నారు. ఒక్కో పరీక్షకు రెండున్నర గంటలు సమయం ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున ప్రతి పేపర్‌కు 150 మార్కులు.. రెండు పరీక్షలు కలిపి మొత్తం 300 మార్కులు ఉంటాయి. పరీక్షలకు సంబంధించిన సిలబస్ వివరాలను టీఎస్పీఎస్సీ తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలనం.. ఈడీ చార్జ్‌షీట్ దాఖలు -
TSPSC: మరో నాలుగు నోటిఫికేషన్లు.. 806 కొలువులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ల విడుదల కొనసాగుతూనే ఉంది. ఏడాది చివరిరోజైన శనివారం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నాలుగు నోటిఫికేషన్లు ఇచ్చింది. కళాశాల విద్య కమిషనరేట్ పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ (లెక్చరర్లు), ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్లతోపాటు ఇంటర్ విద్య విభాగంలో లైబ్రేరియన్ పోస్టులు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ పరిధిలో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు, రవాణాశాఖ పరిధిలో అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కొలువులకు వేర్వేరు ప్రకటనలు జారీ చేసింది. ఇందులో అన్నిపోస్టులకు దరఖాస్తుల స్వీకరణ మొదలయ్యే తేదీలను కమిషన్ ప్రకటించింది. ఏఎంవీఐ పోస్టులకు ఏప్రిల్ 23న పరీక్ష ఉంటుందని.. మిగతావాటికి త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. రవాణాశాఖలో 113 ఏఎంవీఐ పోస్టులకు.. రాష్ట్ర రవాణాశాఖ పరిధిలో 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో మలీ్టజోన్–1 పరిధిలో 54, మల్టీజోన్–2 పరిధిలో 59 పోస్టులు ఉన్నాయి. ఈ నెల 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 23న రాత పరీక్ష ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి పూర్తిస్థాయి నోటిఫికేషన్ కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. వాస్తవానికి ఈ పోస్టులకు ఇదివరకే ప్రకటన జారీ చేసినా అభ్యర్థుల అర్హతల్లో మార్పులు చేయడంతో రద్దు చేశారు. తాజాగా మరో నోటిఫికేషన్ జారీ చేశారు. చదవండి: ఇదేమైనా బాహుబలి సినిమానా? -
310 హాస్టల్ వెల్ఫేర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: గిరిజన, బీసీ సంక్షేమ శాఖల్లో ఖాళీగా ఉన్న 310 గ్రేడ్–1, గ్రేడ్–2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. గిరిజన సంక్షేమ శాఖలో గ్రేడ్–1 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్–4, గ్రేడ్–2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్–87, బీసీ సంక్షేమ శాఖలో గ్రేడ్–2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్–219 పోస్టులు భర్తీ చేయనుంది. దరఖాస్తులను ఫిబ్రవరి 6 నుంచి మార్చి 6 వరకు స్వీకరించనున్నారు. మరిన్ని వివరాలను www.tspsc.gov.in వెబ్సైట్లో పొందవచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది. -
కొత్త జిల్లాల తర్వాతే?
► గ్రూపు-2 భర్తీ.. అదనపు పోస్టులు ఇచ్చే అవకాశం ► ఆ దిశగా ఆలోచిస్తున్న ప్రభుత్వం.. నిరుద్యోగులకు తప్పని నిరాశ సాక్షి, హైదరాబాద్ ఈ ఏడాది కూడా నిరుద్యోగులకు నిరాశ తప్పేలా లేదు. టీఎస్పీఎస్సీ గ్రూపు-2 పోస్టుల భర్తీకి ‘కొత్త’ సమస్య వచ్చి పడింది. కొత్త జిల్లాల ఏర్పాటు ఆటంకంగా మారనుంది. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాకే గ్రూపు-2 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేలా ప్రభుత్వ వైఖరి ఉంది. దీంతో గ్రూపు-2 పరీక్ష ఇప్పట్లో నిర్వహించే పరిస్థితిలేదు. ఫలితంగా 5,64,431 మంది నిరుద్యోగులకు ఎదురుచూపులు మిగిలే అవకాశముంది. 439 పోస్టుల భర్తీకి గత ఏప్రిల్ 24, 25 తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉంది. కానీ, పోస్టులు తక్కువగా ఉన్నాయన్న కారణంగా పరీక్షను వాయిదా వేశారు. దీంతో ప్రభుత్వం అదనపు పోస్టులు ఇచ్చే అంశంపై దృష్టి సారించింది. ఈ మేరకు మరో 460 పోస్టులు వస్తాయని అభ్యర్థులు భావించారు. ఇంకా టీఎస్పీఎస్సీకి వాటి వివరాలు అందలేదు. ఈలోగా జిల్లాల విభజన అంశం ముందుకు వచ్చింది. ఈ పోస్టుల భర్తీకి జోనల్ సమస్య ఆటంకంగా మారే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యాకే అదనపు పోస్టులు ఇచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. జిల్లాల విభజనలో భాగంగా ఒక జిల్లాలోని మండలాలు మరో జిల్లా పరిధిలోకి వెళ్లనున్నాయి. దీంతో ఏ పోస్టు ఏ జిల్లా పరిధిలోకి వస్తుంది? ఏ జోన్ పరిధిలోకి వెళ్తుందన్న గందరగోళం నెలకొంది. ఐదో జోన్ పరిధిలో ఉన్న వరంగల్‌లోని మూడు మండలాలు, ఆరో జోన్‌లోని నల్లగొండ జిల్లాకు చెందిన 11 మండలాలను కలిపి కొత్తగా యాదాద్రి జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అలాగే ఆరో జోన్లో ఉన్న మెదక్ జిల్లాలోని 12 మండలాలు, ఐదో జోన్ పరిధిలో ఉన్న కరీంనగర్ జిల్లాలోని 5 మండలాలు, వరంగల్ జిల్లాలోని 4 మండలాలతో సిద్దిపేట జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ కొత్త జిల్లాల ప్రతిపాదనలు జోనల్ సమస్యకు దారి తీసే అవకాశముంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక, గ్రూపు-2 ఖాళీలు స్పష్టంగా ఏయే జిల్లాలో ఎన్ని ఉన్నాయన్న వివరాలు తెలుస్తాయని, అప్పుడే ఆ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిసింది. -
మరో 2 వేల గురుకుల టీచర్ పోస్టులు
► భర్తీకి సీఎం కేసీఆర్ ఆమోదం ► ఇప్పటికే 2,444 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ చర్యలు ► వీలైతే అన్నింటికీ కలిపి నెలాఖరులో నోటిఫికేషన్! ► నోటిఫికేషన్‌తోపాటే సిలబస్, పరీక్ష నిబంధనలు సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో వివిధ గురుకుల సొసైటీల పరిధిలోని పాఠశాలల్లో దాదాపు 4,500 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే 2,444 పోస్టుల భర్తీకి ఓకే చెప్పగా రాష్ట్రంలో కొత్తగా మంజూరు చేసిన 224 గురుకుల పాఠశాలలు, 30 డిగ్రీ కాలేజీలకు 2 వేల పోస్టులు మంజూరు చేసేందుకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతకం చేసినట్లు తెలిసింది. 224 గురుకుల పాఠశాలల్లో 103 ఎస్సీ గురుకులాలు, 71 మైనారిటీ గురుకులాలు, 50 ఎస్టీ గురుకులాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరో 50 బీసీ గురుకులాల మంజూరు ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో పోస్టుల భర్తీకి ఈ నెలాఖరులో నోటిఫికేషన్ జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. పాఠశాలల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ప్రిన్సిపాల్ పోస్టులు, కాలేజీల్లో జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి అవసరమైన పరీక్ష విధానాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఆయా పోస్టులకు సంబంధించి గురుకుల సొసైటీల నుంచి ఇండెంట్లు, రూల్ ఆఫ్ రిజర్వేషన్లు, రోస్టర్ వివరాలను తీసుకొని నోటిఫికేషన్ జారీ చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. ఈ ప్రక్రియకు మరో 15 రోజుల సమయం పట్టనుంది. మరోవైపు నియామక నిబంధనలు, సిలబస్ రూపకల్పన వంటి అంశాలపై దృష్టి సారించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఈ నెలాఖరుకల్లా పూర్తి చేసి నోటిఫికేషన్ జారీకి అవసరమైన చర్యలు చేపట్టాలని టీఎస్పీఎస్సీ అధికారులను చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఆదేశించినట్లు తెలిసింది. ఈ నెలాఖరులో నోటిఫికేషన్ ఇచ్చే నాటికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరో 2 వేల పోస్టుల వివరాలు అందితే వాటిని కూడా కలిపి మొత్తంగా దాదాపు 4,500 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆ వివరాలు అందడం ఆలస్యమైతే తొలుత 2,444 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి ఆ తరువాత 2 వేల పోస్టులు వచ్చాక వాటిని అదే నోటిఫికేషన్ పరిధిలోకి తేవాలని భావిస్తోంది. మరోవైపు కేటగిరీలవారీగా పోస్టులకు నిర్వహించే పరీక్ష సిలబస్‌ను ముందుగా ప్రకటించాలని భావిస్తోంది. వీలుకాకపోతే నోటిఫికేషన్‌తోపాటు జారీ చేసే అవకాశం ఉంది. అర్హత పరీక్షగానే టెట్? ఇప్పటిరవకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) స్కోర్‌కు ఉపాధ్యాయ నియామకాల్లో 20 శాతం వెయిటేజీ ఉంది. కానీ ప్రభుత్వం ప్రకటించిన ఇటీవల గురుకులాల్లో భర్తీ చేసే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల పరీక్ష విధానంలో టెట్ అంశాన్ని ప్రస్తావించలేదు. దీంతో టీజీటీ పోస్టులకు టెట్ అవసరమా లేదా అనే సందేహం నెలకొంది. అయితే టెట్‌ను కేవలం అర్హత పరీక్షగానే చూడాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. టెట్ స్కోర్‌కు వెయిటేజీని తొలగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు టె ట్ వెయిటేజీ అంశంపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 5న జరిగే టీఎస్పీఎస్సీ కమిషన్ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. -
బ్రోకర్లకు తావులేకుండా నియామకాలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షలలో బ్రోకర్లకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. 1422 కొత్త ఏఈ పోస్టులకు సోమవారం నాడు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. నవంబర్ 8వ తేదీన ఈ పోస్టులకు రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. డిసెంబర్‌లోగా మొత్తం నియామక ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. అలాగే.. తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కో సిబ్బంది కష్టపడి పని చేస్తున్నారని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని ఆయన కోరారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషిచేస్తోందని జగదీశ్ రెడ్డి చెప్పారు. -
కొలువుల జాతర
-
టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల