నేటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పారామెడికల్ కళాశాలల్లో 2016-17 విద్యా సంవత్సరానికి డిప్లొమా ఇన్ పారామెడికల్ సీట్లలో ప్రవేశాలకు పారామెడికల్ బోర్డు గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. ఈనెల 20 (శుక్రవారం) నుంచి డీఎంఈ వెబ్‌సైట్‌లో అప్లికేషన్‌లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తిచేసిన దరఖాస్తులు జూన్ 13లోగా సమర్పించాల్సి ఉంటుంది. జూన్ 20 నుంచి మొదటి విడత కౌన్సిలింగ్ మొదలువుతుందని పారామెడికల్ బోర్డు కార్యదర్శి డా.వేణుగోపాల్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇంటర్మీడియెట్‌లో బైపీసీ గ్రూపు చదివిన అభ్యర్థులు మాత్రమే ఈ కోర్సులకు అర్హులు. జూన్ 30 నుంచి రెండో విడత కౌన్సిలింగ్ జరుగుతుంది. జులై 5వ తేదీ నాటికి సెలక్షన్ ప్రక్రియ ముగుస్తుంది. జులై 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఛీఝ్ఛ.్చఞ.జీఛి.జీ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
‘పారామెడికల్’ ప్రవేశాలకు నోటిఫికేషన్
Published Fri, May 20 2016 3:30 AM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM
Advertisement
Advertisement