హైదరాబాద్: ఇంటి ముందు సిగరెట్ కాల్చొద్దన్నందుకు ఓ యువకుడు వృద్ధురాలిని హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ ఓయూ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలను ఈస్ట్‌జోన్ డీసీపీ డాక్టర్ రవీందర్ వెల్లడిం చారు. శుక్రవారం ఉదయం బోడుప్పల్‌కు చెందిన సాయిప్రసాద్(27) రవీంద్రనగర్ కాలనీ(సీతాఫల్‌మండీ సమీపం)లోని తన స్నేహితుల ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో అతడు ఇంటి ముందు కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు.
ఇంట్లో ఉన్న వృద్ధురాలు ఇందిరాదేవి(82) వచ్చి సిగరెట్ కాల్చొద్దని సాయిప్రసాద్‌ను హెచ్చరించింది. అయినా సిగరెట్ తాగుతుండడంతో నీళ్లు తీసుకువచ్చి అతనిపై పోసింది. కొద్దిసేపటి తర్వాత ఎవరూ లేని సమయం లో వృద్ధురాలి ఇంట్లోకి సాయిప్రసాద్ చొరబడి తలదిండును ముఖానికి అదిమి పట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం బీరువాలోని రూ.21 వేలు, టీవీ, సెల్‌ఫోన్ తీసుకొని ఉడాయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని ఇఫ్లూ జంక్షన్ వద్ద ఆదివారం అరెస్ట్ చేశారు.
సిగరెట్ కాల్చొద్దన్నందుకు వృద్ధురాలి హత్య
Published Mon, Jan 16 2017 12:33 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement