బలి తీసుకున్న బర్గర్... | one dies, eight hospitalized while eating burger | Sakshi
Sakshi News home page

బలి తీసుకున్న బర్గర్...

Published Wed, Apr 2 2014 10:24 AM | Last Updated on Wed, Sep 26 2018 3:36 PM

బలి తీసుకున్న బర్గర్... - Sakshi

బలి తీసుకున్న బర్గర్...

హైదరాబాద్ : బేకరీ పదార్థాల్లో బర్గర్‌ అంటే.. ఇష్టపడనివారుండరు. కమ్మని బర్గర్‌తో ఆకలి తీర్చుకోవాలనుకోగా  అది ఒకరి ఆయువు తీసింది. హైదరాబాద్ పాతబస్తీ హఫీజ్‌ బాబానగర్‌లోని బేక్ వెల్ బేకరీలో ఆహారం కలుషితమైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఎనిమిదిమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం బేకరీ బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement