
1500 కిమీ సైకిల్‌పై ప్రయాణించి పవన్‌ను కలిసిన వీరాభిమాని
సిటీబ్యూరో: తన అభిమాన హీరో పవన్ కల్యాణ్ కోసం ఓ వీరాభిమాని సైకిల్‌పై 1,500 కిమీ ప్రయాణం చేసి వచ్చి కలిశాడు. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌కు చెందిన అద్దంకి రవికి పవన్‌పై ఎనలేని అభిమానం.
రవి ఏప్రిల్ 3న ఖరగ్‌పూర్ నుంచి సైకిల్‌పై బయల్దేరి నెలరోజుల పాటు 1,500 కిలోమీటర్లు ప్రయాణం చేసి గురువారం సాయంత్రం తన అభిమాన హీరో పవన్ కల్యాణ్‌ను ఆయన కార్యాలయంలో కలుసుకున్నాడు. అనంతరం రవి మాట్లాడుతూ చాలా ఏళ్లుగా పవన్‌ను కలవాలన్న తన కోరిక తీరిందని సంబరపడ్డాడు.