
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఎల్‌ఆర్‌ఎస్ క్లియరెన్స్ ప్రక్రియ గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. హెచ్‌ఎండీఏకు అందిన 1.75 లక్షలకుపైగా దరఖాస్తుల్లో దాదాపు 93వేల దరఖాస్తులకు ఆమోదముద్ర వేసినా అందులో దాదాపు 21వేల మంది దరఖాస్తుదారులు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు కట్టలేదు. ఇప్పటికే పదేపదే వారి సెల్ నంబర్లకు సంక్షిప్త సమాచారం (ఎస్‌ఎం ఎస్) పంపిస్తున్నా స్పందన కనబడటం లేదు.
ఈ నెల 31 లోపు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు కట్టకపోతే ఆ దరఖాస్తులన్నీ తిరస్కరిస్తామని హెచ్‌ఎం డీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ 21 వేల మందితో పాటు ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ పరిశీలనలో ఉన్న మరో 3 వేల దరఖాస్తులు క్లియరైతే దాదాపు రూ.150 కోట్లు హెచ్‌ఎండీఏ ఖజానాలో వచ్చి చేరుతాయని అంచనా. ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుల రూపంలో రూ.650 కోట్లు, నాలాల ఫీజు రూపంలో రూ.150 కోట్లు హెచ్‌ఎండీఏ చేతికి అందాయి.
ఎస్‌ఎంఎస్‌లు వెళ్లినా స్పందన లేదు..
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు ప్రక్రియలో టైటిల్ స్క్రూటినీ, టెక్నికల్ స్క్రూటినీ పూరయ్యాక అంతా సక్రమమని తేలితే క్లియరెన్స్ ఇస్తారు. ఎల్‌ఆర్‌ఎస్, నాలా ఫీజు చెల్లించాలంటూ సద రు దరఖాస్తుదారుడి సెల్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌లు పంపుతారు. అది చెల్లించగానే ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇస్తారు. 93 వేలకు పైగా దరఖాస్తులను క్లియర్ చేస్తే దాదాపు 21 వేల మంది ఫీజు చెల్లించలేదు. ఫీజు చెల్లించాలంటూ ఎన్నిసార్లు ఎస్‌ఎంఎస్‌లు పంపినా చలనం ఉండట్లే దని అధికారులు వాపోతున్నారు.
సెల్ నంబ ర్లు మారి ఉండొచ్చనే వాదన వినబడుతున్నా అది చూసుకోవడం వారి బాధ్యత అని చెబుతున్నారు. ఓపెన్ ప్లాట్లు క్రమబద్ధీకరణ కాక కార్యాలయం చుట్టూ తిరిగే వారి సంఖ్య పెరిగిందని, అయితే అన్నీ సక్రమంగా ఉండి ఫీజు సమాచారం అందుకున్నవారు ఇప్పటిౖకైనా నిర్లి ప్తత వీడి ఫైనల్ ప్రొíసీడింగ్స్ చేతిలో పడేలాగా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా, దాదాపు 79 వేల దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment