
58:42 నిష్పత్తిలో జీతభత్యాలు చెల్లించండి
- పరిపాలన ట్రిబ్యునల్ సిబ్బంది విషయంలో హైకోర్టు స్పష్టత
- జీతాల చెల్లింపులపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ) చైర్మన్, సభ్యులు, ఉద్యోగుల జీతభత్యాలు, రోజువారీ ఖర్చుల చెల్లింపులపై హైకోర్టు స్పష్టత నిచ్చింది. జీతభత్యాలను 58:42 నిష్పత్తిలో చెల్లించా లని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఆదేశించింది. రోజు వారీ చెల్లింపులను మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేసింది. ఉద్యోగుల విభజనపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి రాలేక పోయినందున ఈ వ్యవహారంలో జోక్యం చేసుకో వాలని కేంద్రాన్ని ఆదేశించింది. గరిష్టంగా 3 నెలల్లో ఉద్యోగుల విభజనను కొలిక్కి తీసుకురావాలని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఏపీఏటీ సభ్యుల కొనసాగింపు విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రావాలని సూచించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగ నాథన్, న్యాయమూర్తి అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.
జీతభత్యాలు, ఆస్తుల విభజనకు సంబంధం లేదు
ఏపీఏటీ చైర్మన్, సభ్యులు, ఉద్యోగుల జీతభత్యాలను చెల్లించకపోవడంతోపాటు రోజువారీ నిర్వహణ బిల్లులను స్వీకరించేందుకు ఏపీ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది కె.శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గత నెలలో ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. మంగళవారం ఈ వ్యాజ్యం విచారణకు రావడంతో ఉభయ రాష్ట్రాల సీఎస్‌లు తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేశారు. ఏప్రిల్ 2015 నుంచి అక్టోబర్ 2016 వరకు ఏపీఏటీ వ్యయాలన్నింటినీ తామే భరించామని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి తెలిపారు. ఏపీఏటీ పరిధి నుంచి తెలంగాణను తప్పిస్తూ ఈ ఏడాది సెప్టెంబర్ 15న కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిందని, ఆ తరువాత కూడా ఓ నెలపాటు తామే జీతభత్యాలు, ఇతర ఖర్చులను చెల్లించామన్నారు.
ఏపీఏటీతో తమకు ఎటువంటి సంబంధం లేదని, ఉద్యోగుల విభజన ప్రక్రియను స్థానికత ఆధారంగా పూర్తి చేయాల్సి ఉందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది డి.రమేశ్ వాదనలు వినిపిస్తూ... ఉద్యోగుల విభజనతోపాటు ఆస్తుల విభజనను కూడా పూర్తి చేయాలన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ... జీతభత్యాల చెల్లింపునకూ, ఆస్తుల విభజనకు సంబంధం ఏముందని ప్రశ్నించింది. తమ ఉత్తర్వులున్నా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఏకాభిప్రాయానికి రాలేదని, దీంతో తప్పని పరిస్థితుల్లో తాము తగిన ఆదేశాలు జారీ చేయాల్సి వస్తోందని ధర్మాసనం తెలిపింది.
ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
ఇరు రాష్ట్రాల మధ్య కుమ్ములాటలతో ఏపీఏటీ చైర్మన్, సభ్యులు, ఇతర ఉద్యోగులు ఇబ్బంది పడుతు న్నారని, వచ్చే నెల జీతం అందుతుందో లేదో తెలియ ని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని ధర్మాసనం పేర్కొంది. ఏపీఏటీ పరిధి నుంచి తెలంగాణను తప్పిం చిన నేపథ్యంలో రోజువారీ ఖర్చులను చెల్లించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం సమంజసం కాదని, ఏపీఏటీ ఉద్యోగుల కేటాయింపులు పూర్తి కాని నేప థ్యంలో జీతభత్యాలను జనాభా ప్రాతిపదికన ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలని ఆదేశించింది. డిసెం బర్ నుంచి ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఈ చెల్లింపులు జరపాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ప్రతీ నెలా 20వ తేదీకల్లా ఖర్చుల వివరాల ను ఏపీఏటీ చైర్మన్ ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలని, 1వ తేదీ కల్లా ప్రభుత్వాలు కేటా యింపులు పూర్తి చేయాలని ధర్మాసనం తెలిపింది.