మహిళల అక్రమ రవాణాపై ‘పీడీ’ అస్త్రం | pd act to eve-teasers | Sakshi
Sakshi News home page

మహిళల అక్రమ రవాణాపై ‘పీడీ’ అస్త్రం

Published Sun, Jan 3 2016 5:12 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM

మహిళల అక్రమ రవాణాపై ‘పీడీ’ అస్త్రం - Sakshi

మహిళల అక్రమ రవాణాపై ‘పీడీ’ అస్త్రం

పోలీసుశాఖ కీలక నిర్ణయం
నిందితులపై ఐపీసీకి బదులు  పీడీ చట్టం కింద కేసులు
ఈవ్ టీజింగ్‌కు అడ్డుకట్టపై  ప్రత్యేక చట్టానికి ప్రతిపాదన
 తమిళనాడు తరహాలో  ఏడాది జైలుశిక్ష సబబని భావన
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెరిగిపోతున్న మహిళల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేం దుకు పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నా రు. ఈ నేరాలకు పాల్పడే వారిపై కఠిన నిబంధనలుండే పీడీ యాక్టు ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. మహిళల అక్రమ రవాణా నిందితులపై ప్రస్తుతం ఐపీసీ సెక్షన్ 370 కింద నమోదు చేస్తున్న కేసులను ఇకపై పీడీ యాక్టు కింద (ఈ చట్టం కింద కేసులు నమోదైతే నిందితులకు కనీసం ఆరు నెలలపాటు బెయిల్ లభించదు) నమోదు చేయాలని నిర్ణయించారు. 
 
 రాష్ట్రంలో గతేడాది యువతుల అక్రమ రవాణాకు సంబంధించి నమోదైన 554 కేసుల్లో పోలీసులు 808 మంది యువతులను రక్షించారు. వారిలో 308 మంది బాలికలున్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో గతేడాది రాష్ట్ర నేర విచారణ విభాగం (సీఐడీ) ప్రత్యేక బృందాలు చేసిన దాడుల్లో రాష్ట్రానికి చెందిన యువతులతోపాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన వారిని కూడా మహిళా బ్రోకర్లు ఉద్యోగాల పేరుతో ఆకర్షించి వ్యభిచార రొంపిలోకి దించినట్లు బయటపడింది. 
 
 చంద్రాపూర్ ఘటనలో పోలీసులు 46 మంది నిందితులను అరెస్టు చేస్తే అందులో 32 మంది మహిళలే ఉండటం గమనార్హం. అంతేకాదు ఈ ఘటన తర్వాత పోలీసుల విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. ఉద్యోగాల పేరుతో తీసుకెళ్తున్న యువతులను వ్యభిచార కూపంలో దిగకపోతే వారిపై అనేక రకాలుగా హింసకు పాల్పడుతున్నట్లు తెలిసింది. యువతులను తమ చెప్పు చేతుల్లోకి తీసుకునేందు కు వ్యభిచార నిర్వాహకులు వారిని నగ్నంగా బాత్రూంలలో బంధించడం, ఆ తర్వాత నాగుపాములను వదిలి తలుపులకు తాళాలు వేసి భయపెట్టడం వంటి దారుణాలకు పాల్పడిన ఉదంతాలు సీఐడీ అధికారుల దర్యాప్తులో వెలుగుచూశాయి.
 
  ఈ నేపథ్యంలో నిందితులపై ఐపీసీ సెక్షన్ 370కు బదులు ఇకపై పీడీ యాక్టు కింద కేసులు పెట్టాలనే నిర్ణయానికి పోలీసులు వచ్చారు. ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని కూడా సీఐడీ నిర్ణయించింది. మరోవైపు ఈవ్ టీజిం గ్‌కు పాల్పడే వారికి తమిళనాడు తరహాలో ఏడాదిపాటు జైలు శిక్ష, రూ.10 వేల జరిమా నా విధించేలా ప్రత్యేకచట్టం తేవాలని పోలీసు శాఖ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈవ్ టీజర్ల ఆగడాలను అరికట్టేందుకు ప్రస్తుతం ‘షీ’ టీమ్స్ చేస్తున్న ప్రయత్నాలు పూర్తిస్థాయిలో రోమియోల ఆగడాలను అరికట్టలేకపోతున్నాయి.
 
  గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 660 కేసులు నమోదు చేసి 825 మంది ఈవ్ టీజర్లను కటకటాల్లోకి నెట్టారు. అయితే ప్రస్తుత చట్టాల ప్రకారం ఈ నేరాలకు పాల్పడే వారిపై పోలీసులు పెట్టీ కేసులు తప్ప ఐపీసీ, నిర్భయ వంటి కేసులు నమోదు చేయలేకపోతున్నారు. దీంతో కేసుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో సత్ఫలితాలిస్తున్న చట్టం తరహాలో దీనికోసం ప్రత్యేక చట్టం అవసరమని పోలీసులు భావిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement