పేకాటాడుతూ పట్టుబడ్డ నాయకులు | police attacks on gambling centers in lb nagar | Sakshi
Sakshi News home page

పేకాటాడుతూ పట్టుబడ్డ నాయకులు

Published Thu, Feb 9 2017 11:11 AM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM

police attacks on gambling centers in lb nagar

- ఎల్బీనగర్‌లో ఎస్‌ఓటీ పోలీసుల దాడులు
 
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పేకాటస్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2.80 లక్షల నగదుతో పాటు 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సాగర్‌ రింగ్‌రోడ్డులోని మల్లికార్జున నగర్‌లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్‌వోటీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాడులు చేశారు. కాగా పట్టుబడిన వారిలో రాజకీయ నాయకులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు మాత్రం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement