gambling centers
-
పేకాటాడుతూ పట్టుబడ్డ నాయకులు
- ఎల్బీనగర్లో ఎస్ఓటీ పోలీసుల దాడులు హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాటస్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2.80 లక్షల నగదుతో పాటు 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సాగర్ రింగ్‌రోడ్డులోని మల్లికార్జున నగర్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్వోటీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాడులు చేశారు. కాగా పట్టుబడిన వారిలో రాజకీయ నాయకులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు మాత్రం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. -
పేకాట కేంద్రాలపై దాడి: ఏడుగురి అరెస్టు
బయ్యారం: పేకాట కేంద్రాలపై పోలీసులు దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఎస్సై అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు సెల్ఫోన్లు, రూ.7 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు, -
12 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
అనంతపురం: అనంతపురం జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. జిల్లాలోని ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామ శివారులోని తోటలో బుధవారం అర్ధరాత్రి దాటాక పేకాట ఆడుతున్న స్ధావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ. 2.60 లక్షల నగదు, 5 ద్విచక్రవాహనాలు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. -
పేకాట శిబిరాలపై పోలీసుల దాడి
హైదరాబాద్: నగర శివార్లలోని పేకాట శిబిరాలపై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి దాడులు చేశారు. ఈ దాడుల్లో కంటోన్మెంట్ మాజీ వైస్ చైర్మన్ టీడీపీ నాయకుడు జయప్రకాష్తో పాటు మరికొంతమందిని అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరిని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.