హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన అక్కచెల్లెళ్ల హత్య కేసులో నిందితుడు అమిత్ సింగ్ ను చైతన్యపురి పోలీసులు బుధవారం రంగారెడ్డి జిల్లా కోర్టులో హజరుపరిచారు. నగరంలోని కొత్తపేటకు చెందిన యామిని, శ్రీలేఖ అనె ఇద్దరు అక్కచెల్లెళ్లను ప్రేమోన్మాది అమిత్‌సింగ్ అతికిరాతకంగా కత్తితో దాడి చేసి హతమార్చిన సంగతి తెలిసిందే.
అప్పటినుంచి తప్పించుకు తిరుగుతున్న అమిత్‌ను పోలీసులు ఎట్టకేలకు మంగళవారం పట్టుకున్నారు. నిందితుడ్ని అమిత్‌ను కఠినంగా శిక్షించాలని ప్రజలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కోర్టు విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అమిత్‌సింగ్‌ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
Published Wed, Jul 29 2015 5:22 PM | Last Updated on Sun, Sep 3 2017 6:24 AM
Advertisement
Advertisement