amith singh
-
ఆ గళంలో...నాగలి
ర్యాప్ సింగర్‌గా సుపరిచితుడైన రోల్‌రైడా బిగ్‌బాస్ సీజన్–2తో అందరికీ మరింత దగ్గరయ్యాడు...! ఎన్నో ర్యాప్, హిప్హాప్ పాటలతో శ్రోతలను అలరించిన రైడా, ర్యాప్ సాంగ్స్‌కి సందేశాత్మకతను జోడించి ప్రత్యేకమైన మార్క్‌ను ఏర్పరచుకున్నాడు. సామాజిక అంశాలను ముడిసరుకుగా తీసుకొని ఆల్బమ్స్ చేసే రోల్‌రైడా.., ఈ సారి రైతుల కథాంశంతో సమస్త మానవాళికి రైతే ఫ్రంట్వారియర్ అంటూ ‘నాగలి’ ర్యాప్‌తో వస్తున్నాడు...! సాక్షి,సిటీబ్యూరో: మ్యూజిక్‌లో ర్యాప్ సాంగ్స్ అనేవి విభిన్నమైనవి. అంతర్జాతీయంగా దానికంటూ ప్రత్యేకంగా మ్యుజిషియన్స్ ఉన్నారు. ఎన్నో పాశ్చాత్య సంగీత శైలుల్ని అందిపుచ్చుకోగలిగినా.. తెలుగులో ర్యాప్సింగర్స్ మాత్రం కొందరే ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకంటూ ప్రత్యేకించిన ర్యాప్ పాటలతో యూట్యూబ్‌లో బాగా ఫేమస్ అయ్యాడు రోల్‌రైడా. ‘అరుపు’..ఓ పిలుపు... విభిన్నమైన కాన్సెప్టులతో పలు ర్యాప్, హిప్హప్ సాంగ్స్ చేశాడు రైడా. ముఖ్యంగా మహిళలపైన, చిన్నారులపైన జరుగుతున్న లైంగిక అఘాయిత్యాలను ప్రతిస్పందిస్తూ ‘అరుపు’ పేరుతో చేసిన ర్యాప్‌సాంగ్ విశేషమైన ఆదరణ పొంది కోట్ల సంఖ్యలో వీక్షకుల్ని సొంతం చేసుకుని, ఎంతోమందిని ఆలోచింపజేసింది. అతిసున్నితమైన అంశాలని హృదయానికి హత్తుకునేలా మ్యూజిక్‌ని, సాంగ్ వెర్షన్‌ని రోల్‌రైడా ఎంచుకుంటాడు. రైడా ర్యాప్ సింగర్ మాత్రమే కాకుండా మంచి రైటర్ కూడా. తన ర్యాప్స్‌తో సినిమాల్లో కూడా ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రముఖ టాలివుడ్ మ్యూజిక్ డైరెక్టర్ల కోసం పలు సినిమాలకి సైతం ర్యాప్ సాంగ్స్ పాడాడు. రైతులే ఫ్రంట్వారియర్స్... కరోనా లాక్డౌన్లో ప్రపంచ జీవన విధానమే మారిపోయింది. కానీ మనిషి ఆకలి మాత్రం మారలేదు. ఏది లేకపోయినా సర్దుకున్నాం కానీ ఆకలికి ఓర్చుకోలేకపోయాం. ‘‘ఆహారం లేకపోతే మనిషికి మనుగడే లేదు. మనిషికి అంత ముఖ్యమైన ఆహారాన్ని, అదీ మట్టి నుండి పండిస్తున్న∙రైతుకు మాత్రం సానుభూతి తప్ప తగినంత గుర్తింపు రాలేదు’’ అంటున్నాడు రైడా. గుర్తింపు అటుంచితే సగటు మనిషి సామాజిక, ఆర్థిక జీవనానికి ఎంతో దూరంలో బ్రతుకు బండిని నెట్టుకొస్తున్నాడు. అసలు రైతే లేకుంటే ఏంటి పరిస్థితి., రైతుకు కోపమొస్తే ఏం జరుగుతుంది అనే ఆలోచనతోనే ‘నాగలి’ని రూపొందించానన్నారు. ‘‘ఇది ‘అరుపు టీం’ నుండి వస్తున్న మరో సందేశాత్మక ప్రయోగం. సమాజానికి రైతులే ఫ్రంట్వారియర్స్ అని, వారి స్థితిగతులను, మానవీయ కోనాలను, మానసిక వేదనలను ఇందులో పొందుపరిచామని’’ రైడా తెలిపారు. ఈ ‘నాగలి’లో రైడాతో పాటు బిగ్‌బాస్‌లో అలరించిన ‘అమిత్ తివారి’ కూడా లీడ్‌రోల్‌గా చేశాడు. దీనికి రైడా లిరిక్స్ రాసి, ర్యాప్ పాడగా హరికాంత్ దర్శకత్వం చేశాడు. దీనంతటికి ఆత్మ అయినటువంటి మ్యూజిక్‌ని ప్రవీణ్ లక్కరాజు సమకూర్చాడు. నాగలి ట్రైలర్‌ని శనివారం రిలీజ్ చేయగా.., ఈ ర్యాప్సాంగ్ని స్వాతంత్ర దినోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల కోసం రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం విడుదల చేసిన ట్రైలర్‌కి మంచి స్పందన వస్తుందని రైడా చెప్పారు. -
అమిత్‌సింగ్‌ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన అక్కచెల్లెళ్ల హత్య కేసులో నిందితుడు అమిత్ సింగ్ ను చైతన్యపురి పోలీసులు బుధవారం రంగారెడ్డి జిల్లా కోర్టులో హజరుపరిచారు. నగరంలోని కొత్తపేటకు చెందిన యామిని, శ్రీలేఖ అనె ఇద్దరు అక్కచెల్లెళ్లను ప్రేమోన్మాది అమిత్‌సింగ్ అతికిరాతకంగా కత్తితో దాడి చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి తప్పించుకు తిరుగుతున్న అమిత్‌ను పోలీసులు ఎట్టకేలకు మంగళవారం పట్టుకున్నారు. నిందితుడ్ని అమిత్‌ను కఠినంగా శిక్షించాలని ప్రజలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కోర్టు విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
అక్కాచెల్లెళ్లను బలి తీసుకున్న ప్రేమోన్మాది అరెస్టు
హైదరాబాద్ : నగరంలోని కొత్తపేటలో అక్కాచెల్లెళ్లు యామిని సరస్వతి, శ్రీలేఖను అత్యంత దారుణంగా కత్తితో పొడిచి పరారైన నిందితుడు అమిత్‌సింగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆచూకీ గుర్తించిన పోలీసులు మంగళవారం అతనిని గుజరాత్ లో అదుపులోకి తీసుకున్నారు. అమిత్‌సింగ్‌ను అదుపులోకి తీసుకునేందుకు 4 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిందుతుడి సెల్‌ఫోన్ సిగ్నిల్స్ ఆధారంగా గుజరాత్లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈనెల 14 న కొత్తపేట గాయత్రీపురం రోడ్ నెం-1లోని ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్కాచెల్లెళ్లు శ్రీలేఖ, యామినిలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువతులు చికిత్స పొందుతూ మృతిచెందారు. అక్కాచెల్లెళ్ల లను హత్య చేసిన తర్వాత అమిత్‌సింగ్ ఉప్పల్‌కు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వెళ్లే మార్గంలో మూసీ నది వద్ద చివరగా ఫోన్‌కాల్ మాట్లాడి స్విచ్చాఫ్ చేసినట్టు గుర్తించిన పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లోనూ గాలించారు. 4 బృందాలుగా విడిపోయిన పోలీసులు ఆ కోణంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సిగ్నల్స్ ఆధారంగా మంగళవారం గుజరాత్ లో అమిత్ ను అదుపులోకి తీసుకున్నారు. -
వీరయోధునికి ఘన నివాళి
యాదగిరి, న్యూస్‌లైన్ : గుల్బర్గాలో ఈనెల 8న జరిగిన ఎన్కౌంటర్లో గ్యాంగ్‌స్టర్ మున్నాను మట్టి కరిపించి.. ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ మల్లికార్జున బండె కన్నుమూశారు. ఆయన హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో.. ముఖ్యంగా హైదరాబాద్-కర్ణాటకలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్యాంగ్‌స్టర్ ఎన్కౌంటర్లో ఎస్ఐ మల్లికార్జున బండెతో పాటు ఇద్దరు ఏఎస్ఐలు తీవ్రంగా గాయపడిన సంగతి విదితమే. తలలోకి తుపాకీ గుళ్లు దూసుకుపోవడంతో కోమాలోకి వెళ్లిన మల్లికార్జున బండెకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఆయన త్వరగా కోలుకోవాలని రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది ప్రార్థనలు చేశారు. అయితే మంగళవారం రాత్రి ఆయన మరణ వార్త వెలువడిన వెంటనే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బుధవారం గుల్బర్గాలో అప్రకటిత బంద్ వాతావరణం ఏర్పడింది. యజమానులు స్వచ్ఛందంగా తమ దుకాణాలు బంద్ చేసి.. బండె మృతికి సంతాపం సూచించారు. హైదరాబాద్-కర్ణాటకలో బీదర్ నుంచి మొదలుకుని గుల్బర్గా, యాదగిరి, రాయచూరుతో పాటు అన్ని చోట్ల పలువురు ప్రముఖులు, సంఘ సంస్థల నుంచి బండె వీర మరణానికి సంతాపం వ్యక్తం చేశారు. ముందు జాగ్రత్తగా గుల్బర్గా నగరంతో పాటు ఆళంద, జేవర్గి పట్టణాల్లో బుధ, గురువారాల్లో 144 సెక్షన్‌ను అమలు చేస్తూ గుల్బర్గా ఉపవిభాగం అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్తగా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా బండెకు సకాలంలో వైద్య చికిత్సలు అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అభిమానులు, కన్నడ సంఘాల కార్యకర్తలు బుధవారం గుల్బర్గాలో టైర్లకు నిప్పంటించి నిరసన తెలిపారు. నగరంలోని శాస్త్రి సర్కిల్లో గుమికూడిన అభిమానులు గుల్బర్గా ఎస్పీ అమిత్‌సింగ్‌ను ఘెరావ్ చేసి మల్లికార్జున బండె భౌతికకాయాన్ని సత్వరం తెప్పించాలని డిమాండ్ చేశారు.