సిటీలో యువకులకు కౌన్సెలింగ్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో పలువురు యువకులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అర్ధరాత్రి వరకు రోడ్ల మీద తిరుగుతూ.. ఫైటింగ్‌లకు దిగుతున్న యువకులను సక్రమ మార్గంలో పెట్టడానికి సౌత్‌జోన్ పోలీసులు నూతన మార్గాలను ఆశ్రయించారు. బుధవారం రోజున పాతబస్తీలో 102 మంది యువకులను గుర్తించి ఒక్కచోటకు చేర్చి రాత్రిళ్లు రోడ్లపై తిరిగితే జరిగే పరిణామాలు, పర్యావసనాలను అర్థమయ్యే విధంగా చెప్పారు.
యువకులతో పాటు తల్లిదండ్రులను కూడా పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించారు. గతంలో ఇదే ప్రాంతంలో స్ట్రీట్‌ఫైట్‌కు దిగి నబీల్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు అప్రమత్తమైనట్టు సమాచారం. ఇకపై ఎలాంటి నేరాలు జరగకుండా చూస్తామని పోలీసులు తెలపారు.