ప్రముఖ మాల్స్‌కు నోటీసులు
Published Sat, May 27 2017 8:04 PM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM
హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఏ.ఎస్.రావు నగర్‌లో ఉన్న పలు షాపింగ్ మాల్స్‌లో పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. కళామందిర్, ఆర్.ఎస్.బ్రదర్స్, రాధికా మూవీప్లెక్స్‌లో కుషాయిగూడ పోలీసులు, సిటీ సెక్యూరిటీ వింగ్ సంయుక్తంగా డెకాయ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ మాల్స్‌లో భద్రత ఏపాటిదో పరిశీలించేందుకు పోలీసులు తుపాకులతో లోనికి ప్రవేశించారు. అయితే పోలీసుల వద్ద ఆయుధాలను అక్కడి సిబ్బంది గుర్తించలేదు. దీంతో భద్రతను గాలికొదిలేసిన పలు వాణిజ్య సముదాయాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Advertisement
Advertisement