పాత‘వే’!? | Reconsider on the division of divisions | Sakshi
Sakshi News home page

పాత‘వే’!?

Sep 25 2015 2:23 AM | Updated on Aug 31 2018 8:24 PM

పాత‘వే’!? - Sakshi

పాత‘వే’!?

జీహెచ్‌ఎంసీ వార్డుల (డివిజన్ల) పునర్విభజన కథ మళ్లీ మొదటికొచ్చింది...

జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియకు బ్రేక్ పడుతుందా? పాత మార్గంలోనే ఎన్నికలకు వెళ్లనున్నారా?  ఇప్పటికే ఉన్న 150 డివిజన్‌లే కొనసాగుతాయా? ప్రస్తుత పరిణామాలు... రాజకీయ పార్టీల ‘లెక్కలు’ పరిశీలిస్తే... పెంచడం కంటే ఉన్న వాటితోనే సర్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారులు ఈ లెక్క తేల్చే పనిలో ఉన్నారు.
 
- డివిజన్ల విభజనపై పునరాలోచన
- ప్రస్తుతం ఉన్న 150కే పరిమితం?
- పెంపు యోచనపై మల్లగుల్లాలు
- బలాబలాలపై పార్టీల లెక్కలు
 సాక్షి, సిటీబ్యూరో:
జీహెచ్‌ఎంసీ వార్డుల (డివిజన్ల) పునర్విభజన కథ మళ్లీ మొదటికొచ్చింది. 2011 జనాభా లెక్కల మేరకు డివిజన్లలోని జనాభా మధ్య వ్యత్యాసం దాదాపు సమానంగా (పది శాతం తే డాకు మించకుండా) ఉండాలని హైకోర్టు ఆదేశించింది. దీనికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లను 200కు పెంచేందుకు సిద్ధమైన జీహెచ్‌ఎంసీ పునరాలోచనలో పడింది. 200 డివిజన్లపై వివిధ వర్గాల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలు... టీఆర్‌ఎస్ ప్రభుత్వ రాజకీయ అవసరాలు.. ఇతర  పరిణామాల నేపథ్యంలో డివిజన్లను ఎప్పటిలాగా 150కే పరిమితం చేయాలనే యోచనలో ఉన్నట్లు తె లిసింది.

డివిజన్లను హేతుబద్ధీకరించినప్పటికీ సంఖ్య మాత్రం 150కే పరిమితం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. తప్పనిసరి అనుకుంటే 172కు పెంచాలనే మరో ఆలోచనలోనూ ఉన్నట్లు తెలిసింది. ఈమేరకుఅధికారులు మళ్లీ కసరత్తు మొదలు పెట్టారు. 150... 172... 200 డివిజన్లకు జనాభాను ‘విభజించే’ పనిలో పడ్డారు. ఉన్నత స్థాయి నిర్ణయం మేరకు ఎన్ని డివిజన్లు చేయాలనుకున్నా... సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో హేతుబద్ధీకరణ చర్యలు చేపట్టారు. 2011 లెక్కల మేరకు గ్రేటర్ జనాభా 67,31,790. ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లనే హేతుబద్ధీకరిస్తే... ఒక్కోదానిలో సగటున 44,879 మంది, 172 డివిజన్లు చేస్తే 39,138 మంది, 200 డివిజన్లు చేస్తే 33,659 మంది వంతున ఉండాలని లెక్కలు వేశారు. నియోజకవర్గాల వారీగా ఎన్నేసి డివిజన్లు వస్తాయో లెక్కలు తీస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 200 చేస్తే శివార్లలో ఎక్కువ డివిజన్లు వచ్చే అవకాశం ఉంది. పునర్వ్యవస్థీకరణ పూర్తయ్యాక... రిజర్వేషన్ల అమలుకు బీసీల గణన చేపట్టాల్సి ఉంది. ఆ తర్వాతే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి
 
ఇదీ సంగతి:  ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లలో కొన్నింటిలో అత్యధికంగా, మరికొన్నింటిలో అత్యల్పంగా   జనాభా ఉందని... అన్నిటిలో దాదాపు సమానంగా ఉండేలా పునర్వ్యవస్థీకరణ చేయాలనేది హైకోర్టు తీర్పు సారాంశం. వ్యత్యాసాల వల్ల కొన్ని డివిజన్లకు నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని కొందరు కోర్టుకు వెళ్లడంతో...న్యాయ స్థానం దీనిపై స్పందించింది.
 
పార్టీల లెక్కలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల డీలిమిటేషన్ అంశం మొదటికి వస్తుండటంతో రాజకీయ పార్టీల్లో కూడికలు, తీసివేతలు మొదలయ్యే అవకాశం ఉంది. 200 వార్డులకు విస్తరిస్తే... 2008 కంటే ముందు ఉన్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో వంద డివిజన్లు... జీహెచ్‌ఎంసీలో విలీనమైన మున్సిపాలిటీల్లో మరో వంద డివిజన్లు అవుతాయి. దీంతో రాజకీయంగా కొన్ని పార్టీలకు నష్టం... మరికొన్ని పార్టీలకు లాభం కలిగే అవకాశ ం ఉంది. తాజాగా చేస్తున్న కసరత్తులో 172 లేదా 150కి పరిమితం చేస్తే శివార్లలో కొత్త డివిజన్ల సంఖ్య అతి స్వల్పంగానే పెరగనుంది. ఈ నేపథ్యంలో  డివిజన్లను 200 లేదా 172 లేదా 150కి కుదిస్తే లాభ నష్టాలు ఎలా ఉంటాయన్న అంశంపై అన్ని రాజకీయ పక్షాలు కూడికలు, తీసివేతల్లో నిమగ్నం కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement