ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 24లో అద్దెకు నివాసముంటున్న భవనంలోనే ఓ పార్ట్‌ను మినీ సెక్రటేరియట్ గా మార్చుతున్నారు.
సాక్షి, హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 24లో అద్దెకు నివాసముంటున్న భవనంలోనే ఓ పార్ట్‌ను (డోర్ నెం.8-2-293/82/ఎ/369-బి) మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేసేందుకు గాను లీజు అగ్రిమెంటు కింద ప్రభుత్వం రూ.3 లక్షలు మంజూరు చేసింది.
మినీ సెక్రటేరియట్ భవనానికి నెలకు రూ.లక్ష మంజూరు చేసేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎన్‌వీ రమణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.