ప్రతి హైస్కూల్‌కు రూ. 50 వేలు
ఈ నిధుల్లో రూ. 20 వేలను పాఠశాలల్లో మరమ్మతులు, ల్యాబ్ పరికరాల కొనుగోలు, కంప్యూటర్ ల్యాబ్‌లకు, రూ. 5 వేలను పుస్తకాలు, పీరియాడికల్స్, వార్తా పత్రికలు, స్పోర్ట్స్ పరికరాల కొనుగోలుకు, రూ. 25 వేలను తాగు నీరు, విద్యుత్ చార్జీలు, ఇంటర్‌నెట్, డిజిటల్ తరగతుల నిర్వహణకు విని యోగించాలని సూచిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులను జారీచే సింది. వీటిలో రూ. 500 వరకే డబ్బు ను నేరుగా ఖర్చు చేయాలని, అంత కుమించి వినియోగించాల్సి వస్తే చెక్ రూపంలో, ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్ ద్వారా వినియోగించాలని తెలిపింది.