తెరిచిన గాంధీ ఆస్పత్రి వెనుక గల పద్మారావునగర్ గేటు
గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇటీవల తరచూ జరుగుతున్న ఘటనకు వాస్తు దోషమేనని ఆస్పత్రి పాలనయంత్రాంగం భావించింది. వాస్తు సిద్ధాంతులు, నిపుణుల సూచన మేరకు ఆస్పత్రి వెనుక వైపు పద్మారావునగర్ గేట్‌ను సోమవారం తెరిచారు. గాంధీ ఆస్పత్రిలో రాకపోకలు సాగించేందుకు మొత్తం ఆరు ప్రాంతా ల్లో ద్వారాలను ఏర్పాటు చేశారు. పద్మారావునగర్‌కు చెందిన కొంతమంది తమ వెంట కుక్కలను తెస్తూ ఆస్పత్రి పరిసర ప్రాంతాలను అపరిశుభ్రం చేయడం, ఈ మార్గాన్ని సురక్షితమైనదిగా భావించి అసాంఘిక శక్తులు తమ కార్యక్రమాలకు వినియోగించుకోవడం, ఈ ప్రాం తం రాత్రి సమయాల్లో అవాంఛనీయ ఘటలకు వేదికగా మారడంతో సుమారు మూడేళ్ల క్రితం పద్మారావునగర్ వైపు ఉన్న గేటును మూసివేశారు.
గేటు తెరవాలని ఈ ప్రాంతవాసులతోపాటు సిబ్బంది కోరినా ఆస్పత్రి పాలనయంత్రాంగం ససేమిరా అంది. అయితే గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా శ్రవణ్‌కుమార్ నూతనంగా బాధ్యతలు చేపట్టడం, తరచూ ఘటనలు జరిగి గాంధీ ఆస్పత్రికి చెడ్డపేరు రావడంతో ఆస్పత్రి పాలనయంత్రాంగం వాస్తును నమ్ముకుంది. వాస్తు నిపుణుల సూచన మేరకు పద్మారావునగర్ వైపు గేటును తెరిచి రాకపోకలకు అనుమతించారు.