ఆమె విష్‌లిస్ట్‌లో ఖాన్‌త్రయం | She was in the Khan trio Wish List | Sakshi
Sakshi News home page

ఆమె విష్‌లిస్ట్‌లో ఖాన్‌త్రయం

Published Mon, Dec 8 2014 11:29 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఆమె విష్‌లిస్ట్‌లో ఖాన్‌త్రయం - Sakshi

ఆమె విష్‌లిస్ట్‌లో ఖాన్‌త్రయం

‘యాక్షన్ జాక్సన్’లో అజయ్ దేవ్‌గణ్ సరసన మెరిసిన ముగ్గురు భామల్లో ఒకరిగా తెరపై తళుక్కుమన్న మనస్వీ మంగాయ్ బాలీవుడ్‌లో కుంభస్థలానికే గురిపెడుతోంది. మోడలింగ్ రంగం నుంచి సినీరంగానికి వచ్చిన ఈ భామ శరవేగంగా దూసుకుపోవాలని తహతహలాడుతోంది. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్‌ల సరసన నటించాలని ఉందంటూ ఆమె మీడియా వద్ద తన మనసులో మాటను బయటపెట్టింది.

సోనాక్షీ సిన్హా, యామీ గౌతమ్‌లతో పాటు ‘యాక్షన్ జాక్సన్’లో అజయ్ దేవ్‌గణ్‌తో తెరపై రోమాన్స్ పండించిన మనస్వీ, ఈ చిత్రంలో ‘గ్యాంగ్‌స్టర్ బేబీ’ పాటకు వేసిన చిందులు ప్రేక్షకుల్లో కిర్రాకు పుట్టించాయి. ఎక్స్‌పోజింగ్ గురించి ప్రశ్నించిన మీడియా  ప్రతినిధులతో మాట్లాడుతూ.. బోల్డ్‌నెస్ ఇప్పటి  తారలకు చాలెంజ్‌గా మారిందని, ఎక్స్‌పోజింగ్ జమానా అయిపోయిందని, ఎక్స్‌పోజింగ్ తర్వాత ఏమిటని ఎదురు ప్రశ్నించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement