
ముఖ్యమంత్రిపై ఆరోపణలు అర్థం లేనివి
ఎంపీ సీతారాంనాయక్
సాక్షి, హైదరాబాద్: గిరిజను ల రిజర్వేషన్లు, తండాలను పంచాయతీలుగా చేయడం లేదని సీఎం కేసీఆర్‌పై కొం దరు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ సీతారాంనాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గిరిజనుల సమస్యలపై శనివా రం సచివాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి ఆజ్మీర చందూలాల్ నిర్వహిం చిన సమావేశానికి పలువురు గిరిజన ఎంపీలు, నేతలు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసలు తండాలకు నిధులు మంజూరు చేసింది ఏ ప్రభుత్వమో ఓ సారి గుర్తుచేసుకోవాలన్నారు. తెలంగాణలోని ఏడు మండలాలు ఏపీలో విలీనం కావడంతో గిరిజనుల శాతం 9.34 నుంచి 9.08కు పడిపోయిందన్నారు.