ఫిట్‌నెస్ ఫైట్ | Slim Beauty rakul pritsing fitness fight | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్ ఫైట్

Published Mon, Nov 21 2016 12:48 AM | Last Updated on Sat, Aug 3 2019 1:14 PM

ఫిట్‌నెస్ ఫైట్ - Sakshi

ఫిట్‌నెస్ ఫైట్

స్లిమ్ బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్ ‘ఫిట్‌నెస్ మంత్ర’ పఠించింది. ఆదివారం
గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో యువతీ
యువకులకు ఫిట్‌నెస్ పాఠాలు బోధించింది. ప్రతి ఒక్కరికీ
ఆరోగ్యం..అందం ముఖ్యమని చాటిచెప్పింది.

గచ్చిబౌలి: అందాల తార రకుల్‌ప్రీత్ సింగ్ ఫిట్‌నెస్ పాఠాలు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలని సూచించారు. ‘ది గ్రేట్ ఫ్యాన్ డాట్‌కామ్’ ఆధ్వర్యంలో మైనర్ అత్యాచార బాధితులకు చేయూతనిచ్చేందుకు ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ‘ఫిట్‌నెస్ అన్‌ప్లగ్’ పేరుతో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నారుుని నర్సింహారెడ్డి, రకుల్‌ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. హోంమంత్రి మాట్లాడుతూ మహిళల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు.

రకుత్ మాట్లాడుతూ అత్యాచార బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలన్నారు. ఈ సందర్భంగా హగ్ ఇన్నోవేషన్ కంపెనీకి చెందిన రెండు స్మార్ట్ వాచీలను ఇద్దరు అమ్మారుులకు అందజేశారు. ఇందులో కంట్రోల్ రూం, పోలీస్ స్టేషన్ల నంబర్లు నమోదు చేసుకుంటే.. ఆపద ఉన్న సమయంలో బటన్ నొక్కితే వారికి సమాచారం వెళ్తుంది. కార్యక్రమంలో ‘ది గ్రేట్ ఫ్యాన్ డాట్‌కామ్’ సీఈవో సంతోష్ సత్యం  తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement