♦ హైకోర్టు ఉద్యోగుల క్రెడిట్ కోఆపరేటివ్
♦ సొసైటీకి జస్టిస్ సుభాషణ్‌రెడ్డి అభినందన
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత కాలంలో బ్యాంకులు చేతులెత్తేస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఉద్యోగుల క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆరు దశాబ్దాలకు పైగా లాభాల బాటలో కొనసాగుతుండటం విశేషమని ఉభయ రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి అన్నారు. సమర్థమైన నిర్వహణ వల్లే ఇది సాధ్యమైందని, ఇందుకు సొసైటీ కార్యవర్గాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. హైకోర్టు ఉద్యోగుల క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ 65వ వార్షికోత్సవాలు శనివారం హైకోర్టు ప్రాంగణంలో జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ సుభాషణ్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం కోర్టుల్లో దాఖలవుతున్న కేసుల్లో ఎక్కువగా సహకార సంఘాలవే ఉంటున్నాయని అన్నారు.
మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాను బాధ్యతలు నిర్వర్తించిన కాలంలో అధికంగా సహకార సంఘాల కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. ప్రస్తుతం సొసైటీ రూ.1.55 కోట్ల మేర లాభాల్లో ఉందని, ఇకపై సంఘం 12 శాతానికి రుణాలు అందజేస్తుందని జస్టిస్ చంద్రయ్య వివరించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి, సొసైటీ అధ్యక్షుడు జస్టిస్ జి. చంద్రయ్య, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.రామకృష్ణంరాజు, సొసైటీ ప్రతినిధులు రమేశ్‌కుమార్, భవానీ శంకర్, గోవర్ధన్, డి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘సొసైటీ’ లాభాల్లో కొనసాగుతుండటం విశేషం
Published Sun, Mar 27 2016 4:59 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement