సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
- కుటుంబ కలహాలే కారణం
- భర్త, మరిది, అత్తమామలపై కేసు నమోదు
హైదరాబాద్: కుటుంబ కలహాలతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడింది. జేపీ మోర్గాన్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శ్వేత.. 2006లో రాంగోపాల్‌పేట్ నల్లగుట్టకు చెందిన ఫొటోగ్రాఫర్ వై. శ్రీకాంత్‌చారిని వివాహం చేసుకుంది. వీరికి శ్రీలక్ష్మి (8), విన్నీ(4) అనే ఇద్దరు పిల్లలున్నారు. శ్రీకాంత్ ఫొటో స్టూడియోతో పాటు కేబుల్ టీవీ నిర్వహిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. శనివారం ఉదయం శ్వేత పద్మారావునగర్‌లోని స్కంధగిరి దేవాలయంలో కల్యాణం చేరుుంచుకునేందుకు టికెట్ బుక్ చేసుకు రమ్మని భర్తకు చెప్పింది. రాత్రి ఇంటికి వచ్చిన శ్రీకాంత్ టికెట్ తీసుకోలేదని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది.
దీంతో శ్వేత మొదటి అంతస్తులోని గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. తరచుగా ఆత్మహత్య చేసుకుంటానని శ్వేత అంటూ ఉండేది. దీంతో శ్రీకాంత్ పెద్దగా పట్టించుకోలేదు. మర్నాడు ఉదయం 8 గంటలకు శ్రీకాంత్ తలుపు తట్టినా తీయలేదు. దీంతో వెంటనే తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లాడు. అప్పటికే ఆమె చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చని పోరుు ఉంది. రాంగోపాల్‌పేట్ ఇన్‌స్పెక్టర్ మురళీ కృష్ణ, ఎస్సైలు కృష్ణ మోహన్, రఘు, క్లూస్‌టీమ్ ఘటనా స్థలాన్ని పరిశీలిం చి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
భర్త, కుటుంబ సభ్యులే చంపేశారు!
శ్వేతను భర్త శ్రీకాంత్ కుటుంబ సభ్యులే చంపేశారని మృతురాలి తండ్రి శ్రీనివాసాచారి ఆరోపించారు. శ్రీకాంత్ తాగి వచ్చి ఆమెను కొట్టేవాడని, వివాహేతర సంబంధాలు పెట్టుకుని శ్వేతను వేధించేవాడని ఆరోపించారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేయాలని కోరగా ఆమె ఇష్టపడలేదన్నారు. అప్పటి నుంచి వేధింపులు పెరిగాయ న్నారు. ఈ మేరకు భర్త శ్రీకాంత్, అత్తమామలు రేవతి, గణేష్, మరిది అరుణ్‌లపై శ్వేత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.