ఈ నెలాఖరు లేదా వచ్చే నెల తొలి వారంలో షెడ్యూల్ ఖరారు l
సాక్షి, హైదరాబాద్: వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం 2017–18 విద్యా సంవత్సరంలో నిర్వహించాల్సిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్స్) షెడ్యూల్‌పై త్వరలో నిర్ణయం వెలువడనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల తొలి వారంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేయాలని ఉన్నత విద్యా మండలి భావి స్తోంది. వచ్చే విద్యా సంవత్సరంలో జూలై 1 నుంచి అన్ని కోర్సుల్లో తరగతులు ప్రారంభం అయ్యేలా చూడాలనే లక్ష్యంతో ముందుకెళుతోంది.
యథావిధిగానే ఎంసెట్..
ఎంసెట్‌ను 2017–18 లో ప్రవేశాల కోసం వచ్చే ఏడాది మే నెలలో నిర్వహించే అవకాశం ఉందని ఉన్నత విద్యా వర్గాలు తెలిపాయి. ఇంజనీరింగ్‌లో సీట్లు భారీగా మిగిలిపోతున్నందున ఎంసెట్ అవస రమా? మరేదైనా ప్రత్యామ్నాయం చూడాలా? అన్న ఆలోచన ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఎంసెట్‌ను రద్దు చేయడం సాధ్యం కాదని విద్యా వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఇంటర్ మార్కులకు ఎంసెట్ తుది ర్యాంకు ఖరా రులో 20 శాతం వెయిటేజీ ఉంది. ఈ అంశాన్ని తేల్చకుండా, ఇంజనీరింగ్ ప్రవేశాల విధానం ఎలా ఉంటుందన్నది నిర్ణయించకుండా ఎంసెట్‌ను రద్దు చేసే ప్రసక్తే ఉండదని పేర్కొన్నారు. ఒకవేళ రద్దు చేస్తే న్యాయపరమైన సమస్యలు కూడా వస్తాయని ఉన్నత విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై త్వరలో నిర్ణయం
Published Tue, Dec 20 2016 3:57 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement