దసరా సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్-కాకినాడటౌన్ మధ్య ప్రత్యేక ఏసీ రైళ్లు నడపనున్నట్లు ద క్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్-కాకినాడ టౌన్ ఏసీ స్పెషల్ రైలు (07427) హైదరాబాద్ నుంచి 10వ తేది రాత్రి 7.10 గంటలకు బయల్దేరి సికింద్రాబాద్ మీదుగా మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు కాకినాడ టౌన్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో కాకినాడ-సికింద్రాబాద్ ఏపీ స్పెషల్ రైలు (07428) కాకినాడ టౌన్ నుంచి అక్టోబర్ 12 రాత్రి 8 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు సికింద్రాబాద్ చేరుతుందని అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్ -కాకినాడ మధ్య ప్రత్యే రైళ్లు
Published Sun, Oct 9 2016 12:54 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
Advertisement
Advertisement