
భళా భాళిక
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సైదాబాద్లోని సెయింట్ మాజ్ హైస్కూల్ బాలికలు సాహస విన్యాసాలతో అబ్బురపరిచారు. సోమవారం పాఠశాలలో నిర్వహించిన వియత్నాం మార్షల్ ఆర్ట్స్ శిక్షణలో భాగంగా ఆత్మరక్షణకు సంబంధించిన ‘వోవినమ్’ ప్రక్రియను అద్భుతంగా ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి... సరసరా కత్తులు దూసి... ఎదురొచ్చిన శత్రువునెలా మట్టికరిపించాలో చేసి చూపించారు.