సుద్దాలకు కాళోజీ స్మారక పురస్కారం | suddala ashokateja elected to kaloji memorable award | Sakshi
Sakshi News home page

సుద్దాలకు కాళోజీ స్మారక పురస్కారం

Published Sat, Sep 5 2015 6:41 PM | Last Updated on Tue, Oct 30 2018 7:57 PM

suddala ashokateja elected to kaloji memorable award

వెంగళరావునగర్: సినీగేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజను మహాకవి కాళోజీ స్మారక పురస్కారానికి ఎంపిక చేసినట్టు భారత్ కల్చరల్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దర్శక నిర్మాత నాగబాల సురేష్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్ నగరంలోని స్థానిక మధురానగర్‌కాలనీలోని తెలుగు టీవీ ఫెడరేషన్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

తెలుగు టెలివిజన్ రచయితల సంఘం, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా ఏటా మహాకవి కాళోజీ పురస్కారాన్ని వివిధ రంగాల్లో నిపుణులకు అందిస్తోందని చెప్పారు. అందులో భాగంగానే ఈ ఏడాది సుద్దాల అశోక్ తేజకు ఇవ్వనున్నామని తెలిపారు. ఈనెల 8వ తేదీన స్థానిక ఫెడరేషన్ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని ఆయనకు అందజేయనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement