ఈ వేసవిలో నగరంలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఆదివారం ఆయన రాంగోపాల్‌పేట్ డివిజన్ నల్లగుట్టలోని జే లైన్‌లో రూ.3లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన పవర్‌బోర్, సింటెక్స్ ట్యాంకును ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అవసరమున్న చోట వెంటనే బోర్లు వేయించడంతోపాటు గతంలో వినియోగించకుండా ఉన్న బోర్‌వెల్స్‌కు మరమ్మతులు చేయించడం జరుగుతుందన్నారు. బస్తీల్లో, కాలనీల్లో నీటి ఎద్దడి తలెత్తితే వెంటనే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. అధికారులు కూడా ఈ వేసవి ముగిసే వరకు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించినట్లు చెప్పారు.