సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుతో దాదాపు లక్ష మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుందని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, కన్నెపల్లి, ధర్మారం తదితర రిజర్వాయర్లను ఈనెల 23న సుమారు వెయ్యిమంది మత్స్యకారులతో కలసి సందర్శించనున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మరింత విçస్తృతం చేస్తామన్నారు.
గురువారం సచివాలయంలో పశుసంవర్థ్ధకశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణలతో జరిగిన అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రి నేతృత్వంలో మత్స్యకారులు, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ లక్ష్మారెడ్డి, విజయ డెయిరీ ఎండీ నిర్మలతో కూడిన అధికారుల బృందం సందర్శించనుంది.
Comments
Please login to add a commentAdd a comment