బీజేపీకి టీడీపీ షాక్
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ డివి జన్‌లో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. మిత్రపక్షానికి సీటు కేటాయిస్తూనే టీడీపీ ఈ డివిజన్ నుంచి తమ పార్టీ అభ్యర్థికి కూడా బీ ఫారం అందించింది. టీడీపీ రెబల్‌గా వేసిన ఆకుల వెంకటేశ్వరరావుకు ఆ పార్టీ బీ- ఫారం ఇచ్చింది. ఒప్పందంలో భాగంగా దీన్ని బీజేపీకి కేటాయించ గా... ఆ పార్టీ తరఫున చండ్ర మధు బీ-ఫారం అందజేశారు. గురువా రం మధ్యాహ్నం 2 గం టలకు టీడీపీ అభ్యర్థిగా వెంకటేశ్వరరావుకు బీ-ఫారం అందజేయడంతో ఆయ న ఖైరతాబాద్‌లో రిటర్నింగ్ అధికారికి అందించారు.
రెబల్‌గా ఉంటా...
సోమాజిగూడ డివిజన్ నుంచి టీడీపీ రెబల్‌గా నామినేషన్ వేసిన యశోదమ్మ తాను రంగంలో ఉంటానని స్పష్టం చేశారు. రెబల్‌గానే పోటీ చేస్తానని వెల్లడిం చారు. ఈ సీటు ను పద్మా యాదవ్‌కు కేటాయిస్తూ టీడీపీ బీ-ఫారం అందజేసింది. యశోదమ్మను ఉప సంహరించుకోవాలని పార్టీ ఒత్తిడి వచ్చినా ఫలితం లేకపోయింది.
ఎమ్మెల్యే కారుపై దాడి
రామంతాపూర్: తమ నేతకు టికెట్ దక్కకపోవడంతో ఆగ్రహించిన చర్లపల్లి బీజేపీ కార్యకర్తలు ఉప్పల్ ఎమ్మె ల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ కారుపై దాడి చేశారు. కారు పాక్షికంగా ధ్వంసమైంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. వివరాలివీ...రామంతాపూర్ నెహ్రూ నగర్‌లోని ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ నివాసానికి గురువారం చర్లపల్లి డివి జన్ బీజేపీ నాయకులు కాసుల సురేందర్ గౌడ్ తో పాటు అతని అనుచరులు బీఫారం కోసం వెళ్లారు. బీఫా రం మరొకరికి దక్కడంతో ఆగ్రహించిన కార్యకర్తలు ఎమ్మెల్యే కారు (ఏపీ29ఏఈ0001) అద్దాన్ని ధ్వంసం చేశారు.
బీజేపీ స్థానంలో టీడీపీ అభ్యర్థి
సిటీబ్యూరో: బీజేపీ జాబితాలోని మాదాపూర్ డివిజన్ నాటకీయ పరిణామాల మధ్య టీడీపీకి దక్కిం ది. బి-ఫారం చేతికందినా... సకాలంలో అందజేయలేకపోవడంతో బీజేపీ అభ్యర్థి ఎన్నికల బరిలో స్వతంత్రుడిగా మిగిలిపోయారు. పొత్తుల్లో భాగంగా మాదాపూర్‌ను బీజేపీకి కేటాయించారు. అక్కడ సతీష్‌ను అభ్యర్థిగా ఖరారు చేసిన నేతలు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం బి-ఫారం అందించారు. ఇదే స్థానాన్ని ఆశిస్తున్న హరిప్రసాద్ తనకు బి-ఫారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అనుచరులతో కలసి సతీష్‌ను పార్టీ కార్యాలయం నుంచి బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. గడువు సమీపిస్తున్నా బీజేపీ అభ్యర్థి రాకపోవడాన్ని స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ గమనించి అక్కడ స్వతంత్రుడిగా నామినేషన్ వేసిన టీడీపీ అభ్యర్థి ఎర్రగుంట్ల శ్రీనివాస్ యాదవ్‌కు బి- ఫారం ఇచ్చేశారు. చివరి నిమిషంలో శ్రీనివాస్ బి-ఫారాన్ని రిటర్నింగ్ అధికారికి అందజేశారు. సతీష్ ఆందోళనకారుల నుంచి తప్పించుకొని జీహెచ్‌ఎంసీ సర్కిల్-12 కార్యాలయానికి మధ్యాహ్నం 3.15 గంటలకు చేరుకున్నారు. అప్పటికే గడువు ముగియడంతో బీఫారాన్ని తీసుకొనేందుకు రిట ర్నింగ్ అధికారి నిరాకరించారు. మొత్తమ్మీద బీజేపీ శ్రేణుల వివాదం టీడీపీ అభ్యర్థికి కలసివచ్చింది.