వాళ్లు రాహుల్ను టార్గెట్ చేస్తున్నారు | telangana congress leaders protests infront of HCU gate over rohith vemula suicide row | Sakshi
Sakshi News home page

వాళ్లు రాహుల్ను టార్గెట్ చేస్తున్నారు

Published Sat, Jan 30 2016 2:01 PM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

telangana congress leaders protests infront of HCU gate over rohith vemula suicide row

హైదరాబాద్:
ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే స్పేచ్ఛను కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని బర్తరఫ్ చేయాల్సిందేనని శనివారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) గేట్ వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. అయితే ధర్నాకు అనుమతిలేదంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, వీహెచ్, గండ్ర వెంకటరమణారెడ్డి, సంపత్, మల్లు రవి, భట్టి విక్రమార్క, అనిల్ , శ్రీధర్ బాబులను పోలీసులు ఆడ్డుకున్నారు. ఇది ప్రజాస్వామ్య ధర్నా..అనుమతి ఎందుకివ్వరని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్రాలు దళితులకు వ్యతిరేకమని మరోసారి రుజువైందని కాంగ్రెస్ నేతలు సంపత్, మల్లు రవి అన్నారు.

ఏబీవీపీ విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకుంటున్నారని వీహెచ్, షబ్బీర్ అలీ మండిపడ్డారు. రోహిత్ మరణానికి కారణమైన ఏబీవీపీ విద్యార్థులు రాహుల్‌ను టార్గెట్ చేస్తున్నారని ధ్యజమెత్తారు. మా నేత రాహుల్‌కు అండగా నిలిచేందుకే హెచ్‌సీయూ గేట్ వద్ద బైఠాయించామని వీహెచ్, షబ్బీర్ అలీలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement