హైదరాబాద్ : ఇస్రోతో ఎంవోయూ కుదుర్చుకున్న తొలి రాష్ట్రం తెలంగాణ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు వెల్లడించారు. శనివారం హైదరాబాద్లో తెలంగాణ నీటిపారుదల శాఖ, ఇస్రో మధ్య ఎంవోయూ కుదిరింది. అందులోభాగంగా మంత్రి హరీష్ రావు, ఇస్రో చైర్మన్ కిరణ్కుమార్ ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు.
అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.... నీటిపారుదలశాఖ వేగంగా పారదర్శకంగా పని చేయడానికి ఇస్రో సేవలు అవసరమని హరీష్రావు స్పష్టం చేశారు. ఇస్రో అత్యాధునిక టెక్నాలజీ ద్వారా తెలంగాణ జలవనరుల సమాచార వ్యవస్థ జలాశయాల్లో నీటి నిల్వలను ఉపగ్రహంతో విశ్లేషించనుంది.