హైదరాబాద్: తెలంగాణ న్యాయాధికారులు ఎట్టకేలకు సమ్మె విరమించారు. గడిచిన 10 రోజులుగా సమ్మె చేస్తోన్న న్యాయాధికారులు రేపటి(బుధవారం) నుంచి విధులకు హాజరుకానున్నారు.
ఏపీ న్యాయధికారులకు ఆప్షన్ల కేటాయింపపుతో మొదలైన వివాదం అంతకంతకూ పెద్దదైన సంగతి తెలిసిందే. ఆప్షన్ల కేటాయింపును రద్దుచేయాలంటూ ఉద్యమించిన తెలంగాణ న్యాయాధికారులు ఇద్దరిని హైకోర్టు న్యాయమూర్తి సస్సెండ్ చేయడంతో వివాదం ముదిరింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లోని జడ్జిలు మూకుమ్మడిగా సెలవుపెట్టి సమ్మెకు దిగారు. న్యాయం చేస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ సీఎస్ ఠాకూర్ హామీ ఇవ్వడంతో న్యాయాధికారులు కాస్త మెత్తబడ్డారు. సమ్మె విరమిస్తున్నట్లు న్యాయాధికారుల ప్రతినిధులు మంగళవారం సాయంత్రం మీడియాకు తెలిపారు.
సమ్మె విరమించిన న్యాయాధికారులు
Published Tue, Jul 5 2016 8:30 PM | Last Updated on Wed, Sep 19 2018 6:36 PM
Advertisement