strike called off
-
మేం రాజీనామా చేస్తాం.. ఆర్టీసీని అలాగే ఉంచండి
సాక్షి, హైదరాబాద్: కార్మిక నేతలపై కోపాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అమాయక కార్మికులపై చూపడం సరికాదని పేర్కొంటున్న జేఏసీ నేతలు కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. తాము రాజీనామాలు చేసి తప్పుకుంటామని, అప్పుడు ఆర్టీసీని ఉన్నది ఉన్నట్లుగా నిర్వహించాలని పేర్కొననున్నట్లు తెలిసింది. దీనిపై బుధవారం జరిగిన సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ‘చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి కార్మిక సంఘాల నేతలు సమస్యలు సృష్టిస్తున్నారని మాట్లాడారు. ఆయనకు మాపై అంత కోపం ఉంది. దాన్ని అమాయక కార్మికులపై చూపి వారిని విధుల్లోకి తీసుకోకుండా ఆవేదనకు గురి చేయడం సరికాదు. నేను రాజీనామా చేసి తప్పుకునేందుకు సిద్ధం. మిగతా మా జేఏసీ నేతలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆర్టీసీని పాత పద్ధతిలోనే కొనసాగించేందుకు ప్రభుత్వం సిద్ధం కావాలి. గురువారం కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకోవాలి’అని జేఏసీ కో–కన్వీనర్ థామస్‌రెడ్డి అన్నారు. కార్మిక శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు... సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకోకపోవడంతో కార్మికులు తీవ్ర ఆవేదనతో ఉన్నందున వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కార్మిక సంఘాల జేఏసీ మరోసారి ప్రభుత్వాన్ని కోరింది. సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకోకపోవడం చట్ట ప్రకారం సరైన చర్య కాదన్న విషయాన్ని గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి తెలుసుకోవాలని సూచించింది. ఈ మేరకు కార్మిక శాఖ కమిషనర్‌కు జేఏసీ ఫిర్యాదు చేసింది. మరోవైపు అదే ఫిర్యాదు కాపీలను గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఆయా ప్రాంతాల్లో ఉన్న కార్మిక శాఖ కార్యాలయాల్లో అందజేయాలని జేఏసీ నేతలు సూచించారు. ఆ కార్యాలయాలు లేని ప్రాంతాల్లో సేవ్ ఆర్టీసీ పేరుతో ప్రధాన కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహించాలని పేర్కొన్నారు. -
రెండో రోజూ అదే సీన్
సాక్షి, హైదరాబాద్: సమ్మె విరమించిన నేపథ్యంలో విధుల్లో చేరేందుకు పెద్ద సంఖ్యలో కార్మికులు డిపోల వద్దకు చేరుకుంటున్నారు. మంగళవారం ఉదయం తొలి డ్యూటీకి వస్తే అధికారులు నిరాకరించడంతో వెనుదిరిగిన కార్మికులు.. బుధవారం మళ్లీ వచ్చారు. పోలీసులు అడ్డుకున్నా, అరెస్టు చేసినా భయపడకుండా బుధవారం 6 గంటలకే సంబంధిత డిపోల వద్దకు చేరుకోవాలన్న జేఏసీ నేతల పిలుపుతో సూర్యోదయం కంటే ముందే వారు డిపోల వద్దకు చేరుకున్నారు. అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలున్న నేపథ్యంలో అప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చిన పోలీసులు కార్మికులను డిపోలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. సమ్మె విరమించినా తమను ఎందుకు అనుమతించడంలేదని వారితో వాగ్వాదానికి దిగారు. 97 డిపోల వద్ద ఇదే పరిస్థితి కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో కార్మికులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకోకపోవడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ ఇదే పరిస్థితి పునరావృతమైతే గురువారం కార్మికశాఖ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయనున్నట్లు కార్మికులు తెలిపారు. మరోవైపు విధుల్లో చేరేందుకు పెద్ద సంఖ్యలో కార్మికులు డిపోల ముందు ఆందోళన చేస్తున్నా అధికారులు మాత్రం తాత్కాలిక సిబ్బందితో యథాప్రకారం బస్సులు నడిపించారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 73శాతం బస్సులు తిప్పినట్లు వారు పేర్కొన్నారు. 1,907 అద్దె బస్సులు సహా మొత్తం 6,564 బస్సులు తిప్పినట్లు తెలిపారు. 4,657 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,564 మంది తాత్కాలిక కండక్టర్లు విధులకు హాజరైనట్లు పేర్కొన్నారు. 6,488 బస్సుల్లో టిమ్ యంత్రాలు వాడారని, 68 బస్సుల్లో పాత పద్ధతిలో టికెట్లు జారీ చేశారని వెల్లడించారు. -
నేనే ఆర్టీసీ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ‘ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మీ వైఖరితో తీవ్ర మానసిక వేదనకు గురయ్యా. ఆత్మాభిమానాన్ని చంపుకొని ఉద్యోగం చేయలేను. మమ్మల్ని డిపో వద్దకు కూడా రానివ్వడం లేదు. బస్టాండ్, డిపో చుట్టూ బారికేడ్లు పెట్టారు. లోపలికి వెళ్తే మాపై కేసులు పెడుతున్నారు. దీంతో ఆవేదన చెందా. మీరు ఉద్యోగం నుంచి తీయడం కాదు.. నేనే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా’ అని సోషల్ మీడియా వేదికగా సూర్యాపేట డిపోకు చెందిన కండక్టర్ లునావత్ కృష్ణానాయక్ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశాడు. కృష్ణానాయక్‌ది సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం సూర్యానాయక్ తండా. ఇతను సోషల్ మీడియాలో పోస్టు చేసిన లేఖ బుధవారం వైరల్ అయింది. కృష్ణానాయక్ 2009 నుంచి కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై కార్మికులు, రాజకీయ వర్గాల్లో చర్చసాగింది. ఆ లేఖలో.. ‘తెలంగాణలో గౌరవంతో ఉద్యోగం చేద్దామ నుకున్నా.. ఆత్మగౌరవంతో బతుకుదాం అనుకున్నా. కానీ మీలాంటి గొప్ప మనిషి ఉన్న ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టాను అనే మానసిక వేదనకు గురై ఈ నిర్ణయం తీసుకున్నా’ అని ప్రారంభించి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర ఇబ్బందులను అందులో ప్రస్తావించాడు. ‘కార్మికులు ఏం తప్పుచేశారని.. మహిళలని చూడకుండా లాఠీలతో కొట్టించడం, అరెస్టులు చేయడం ఏంటి’ అని ప్రశ్నించాడు. తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని, సంస్థ నుంచి రావాల్సిన బకాయిలు ఇప్పించాలని కోరాడు. పోస్టు నిజమే: కృష్ణానాయక్ మమ్మల్ని డిపో వద్దకు రానివ్వడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. సోషల్ మీడియాతో అందరికీ తెలవాలని సీఎంకు లేఖ రాశా. మేనేజర్ కలిస్తే రాజీనామా కచ్చితంగా ఇస్తా.. వెనక్కు పోను. -
పారిశుద్ధ్య కార్మికుల సమ్మె విరమణ
నేటి నుంచి విధుల్లోకి పారిశుద్ధ్య కార్మికులు 279 జీఓను 110 మున్సిపాలిటీల్లో అమలు చేసిన తరువాతే నెల్లూరు కార్పొరేషన్లో అమలు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, నగర ఇన్చార్జ్ ముంగమూరు శ్రీధర్కృష్ణారెడ్డిల హామీ నెల్లూరు, సిటీ : పారిశుద్ధ్య కార్మికులకు తాత్కాలిక ఊరట లభించింది. 279 జీఓను రద్దు చేయాలని గత వారం రోజులుగా సమ్మె చేస్తుండగా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, నగర ఇన్చార్జ్ ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి రంగంలోకి దిగి కార్మికుల సమ్మె విరమింపచేశారు. నగరంలోని నవాబుపేట బీవీఎస్ పాఠశాల సమీపంలో గురువారం జనచైతన్యయాత్ర కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో పారిశుద్ధ్య కార్మికులు జనచైతన్య యాత్ర వద్దకు భారీగా చేరుకున్నారు. సీఐటీయూ. సీపీఎం నాయకులు టీడీపీ నాయకులతో ఆరగంట పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు, కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ 279 జీఓ అమలు చేయడం ద్వారా కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదన్నారు. ఇప్పటికే కాంట్రాక్ట్ పద్ధతిన 200 మంది కార్మికులను నియమించుకున్నారని, వారికి కేవలం రూ.5 వేలు మాత్రమే జీతం చెల్లిస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు బ్యాంక్ అకౌంట్లలోకి జీతాలు వస్తున్నాయని, జీఓ అమలు జరిగితే కార్మికులు జీతాల కోసం కాంట్రాక్టర్ల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. కార్మికుల సమ్మెను దళితబాట పట్టిస్తున్నారని కొంత మంది టీడీపీ నాయకులు విమర్శించడం దుర్మార్గమని పేర్కొన్నారు. జీఓ అమలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వెళితే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సీపీఎం నాయకులు పెంచలయ్య, అల్లాడి గోపాల్, మస్దాన్బీ తదితరులు పాల్గొన్నారు. 279 జీఓ 109 మున్సిపాలిటీల్లో అమలు చేసిన తరువాతే నెల్లూరులో.. రాష్ట్రవ్యాప్తంగా 279 జీఓ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని, అయితే 110 మున్సిపాలిటీల్లో 109 మున్సిపాలిటీల్లో జీఓను అమలు చేసిన తరువాతే నెల్లూరు నగర పాలక సంస్థలో ఈ జీవో అమలు అవుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, నగర ఇన్చార్జ్ ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి కార్మికులకు హామీ ఇచ్చారు. కార్మికుల సమస్యలపై చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. మేయర్ అజీజ్‌కు బీద చురక.. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆ సంఘ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని బీద రవిచంద్ర మేయర్ అజజ్కు చురకలంటించారు. టీడీపీలో ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, అనురాధ, రమేష్‌రెడ్డి కౌన్సిల్లో పనిచేసిన వారేనని గుర్తుచేశారు. వాళ్లతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. గత వారం రోజులుగా మేయర్ వ్యవహరించిన తీరుపై బీదా రవిచంద్ర ఆసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో మేయర్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై బీద రవిచంద్ర పార్టీ వర్గాల ముందు పరోక్షంగా హెచ్చరించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. -
సమ్మె విరమించిన న్యాయాధికారులు
హైదరాబాద్: తెలంగాణ న్యాయాధికారులు ఎట్టకేలకు సమ్మె విరమించారు. గడిచిన 10 రోజులుగా సమ్మె చేస్తోన్న న్యాయాధికారులు రేపటి(బుధవారం) నుంచి విధులకు హాజరుకానున్నారు. ఏపీ న్యాయధికారులకు ఆప్షన్ల కేటాయింపపుతో మొదలైన వివాదం అంతకంతకూ పెద్దదైన సంగతి తెలిసిందే. ఆప్షన్ల కేటాయింపును రద్దుచేయాలంటూ ఉద్యమించిన తెలంగాణ న్యాయాధికారులు ఇద్దరిని హైకోర్టు న్యాయమూర్తి సస్సెండ్ చేయడంతో వివాదం ముదిరింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లోని జడ్జిలు మూకుమ్మడిగా సెలవుపెట్టి సమ్మెకు దిగారు. న్యాయం చేస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ సీఎస్ ఠాకూర్ హామీ ఇవ్వడంతో న్యాయాధికారులు కాస్త మెత్తబడ్డారు. సమ్మె విరమిస్తున్నట్లు న్యాయాధికారుల ప్రతినిధులు మంగళవారం సాయంత్రం మీడియాకు తెలిపారు. -
మున్సిపల్ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
-
మున్సిపల్ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమ్మె విరమించేందుకు మున్సిపల్ కార్మికులు అంగీకరించారు. హైదరాబాద్‌లో రూ. 8500, మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో రూ.8.300, నగర పంచాయతీ కార్మికులకు రూ.7.300 వంతున జీతం పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అలాగే హైదరాబాద్‌లో జేఎన్ఎన్యూఆర్ఎమ్ పథకం కింద కార్మికులకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు కూడా అంగీకారం కుదిరింది. మున్సిపాలిటీలు, పంచాయతీల్లో కార్మికులకు ఇందిరమ్మ పథకం కింద గృహ నిర్మాణానికి అంగీకరించారు. పదో పీఆర్సీ అమలైన వెంటనే కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసేందుకు ప్రభుత్వం ఒప్పుకొంది. రెగ్యులర్ ఉద్యోగులకు జీపీఎఫ్ అకౌంట్లకు కూడా అంగీకారం కుదిరింది. జీహెచ్ఎంసీ, జీవీఎంసీ, విజయవాడలో కార్మికులకు సిటీ అలవెన్సులను ఇచ్చే విషయంలో స్థానిక సంస్థల్లో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల హెల్త్ కార్డుల అంశంపై లేఖ రాస్తానని కార్మిక నేతలకు మున్సిపల్ శాఖ మంత్రి మహిధర్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇవి కాక ఇంకా.. ప్రమాద బీమా కల్పిస్తారు, కొబ్బరినూనె, సబ్బులు, చెప్పులు, గ్లోవ్స్, యాప్రాన్లు, మాస్కులు తదితర రక్షణ సామగ్రి అందిస్తారు. ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలకు రూ. 10,000 ఇస్తారు. వారాంతపు సెలవులు, ప్రభుత్వ సెలవులు వర్తిస్తాయి. ఈఎస్ఐ, ఈపీఎఫ్ ఎప్పటికప్పుడు చెల్లించడంతో పాటు ఎవరికి వారికి విడివిడిగా స్లిప్పులు ఇస్తారు.