► స్థానిక, రాష్ట్ర కేడర్ ఉద్యోగులకు అవకాశం
► నివేదిక కోసం కమిటీ ఏర్పాటు
► రెండు రాష్ట్రాల సీఎస్‌ల ఆమోదంతో ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. స్థానిక, రాష్ట్ర కేడర్ ఉద్యోగులకు పరస్పర బదిలీకి అవకాశం కల్పించనున్నారు. అలాగే భార్య, భర్తల కేసులో అంతర్రాష్ట్ర బదిలీలకు అవకాశం కల్పించనున్నారు.
ఈ కేటగిరీల బదిలీలను పరిగణనలోకి తీసుకుని ఓ విధానాన్ని రూపొందించేందుకు 2 రాష్ట్రాల అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తూ 2 రాష్ట్రాల సీఎస్‌లు సత్య ప్రకాశ్ టక్కర్, రాజీవ్ శర్మ సంయుక్తంగా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అధికారుల కమిటీ తక్షణం సమావేశమై విధానాన్ని రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీ పున ర్విభజన విభాగం ముఖ్యకార్యదర్శి ఎల్. ప్రేమచంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) కార్యదర్శి, తెలంగాణ పునర్విభజన విభాగం ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, తెలంగాణ సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) కార్యదర్శి సభ్యులుగా అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు.
ఏపీ, తెలంగాణ మధ్య పరస్పర బదిలీలు
Published Thu, Aug 4 2016 1:31 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
Advertisement