మరో ఐదు రోజులు ఎండ మంటలు!
హైదరాబాద్: తెలుగురాష్ట్రాల ప్రజలు మరో ఐదు రోజులు ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరి అవ్వాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వచ్చే వారంలో వడగాల్పులు వీస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ వడగాల్పుల కారణంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 45 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండవచ్చని శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. ఏపీ, తెలంగాణలో రాత్రిపూట 20-30 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు.
ఏపీలో అయితే నెల్లూరులో 44.3 డిగ్రీలు, అనంతపురంలో 43.5 డిగ్రీలు, కర్నూలులో 43.6 డిగ్రీల ఉంది. తెలంగాణ జిల్లాల్లో వరంగల్ లో 43.3 డిగ్రీలు, హైదరాబాద్ లో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలుగురాష్ట్రాల్లో రోజుకు పది మందికిపైగా మృత్యువాత పడుతుండగా, మరో ఐదు రోజులు వీచే వడగాల్పులతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి.