నల్లకుంట, న్యూస్‌లైన్: నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో బుధవారం మరో 10 డిఫ్తీరియా కేసులు నమోదయ్యాయి. మంగళవారం మొత్తం 33 మంది ఆస్పత్రిలో చేరగా, 14 మందిని బుధవారం డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం మొత్తం 29 మంది చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. కాగా, డిఫ్తీరియా ప్రబలిన గోపన్‌పల్లిలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ముషీరాబాద్ బడీమసీద్- అబ్దుల్ కరీమ్ (11), వట్టిపల్లి ఫతేమైదాన్- మతిన్ (11), జెరీలిన్, అలీజా కోట్ల- సాలిహా సిద్ధిఖి (9), మలక్‌పేట- అమీనాబీ (12)లకు డిఫ్తీరియా సోకినట్టు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ నెలలో డిఫ్తీరియాకు సంబంధించి 150 కేసులు నమోదైనట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ స్పష్టం చేశారు.
కొత్తగా ఆస్పత్రిలో చేరిన వారు వీరే...
గోపన్‌పల్లి- వంశీకృష్ణ (9), సంతోష్‌నగర్- మరియాకాసిమ్ (9), జైన్ (19), సికింద్రాబాద్- రిజ్వాబేగం (45), చాదర్‌ఘాట్- ప్రియాంక (8), ఖార్వాన్- నఫీజ్ (20), కోకాపేట- అనురాధ (25), యాకుత్‌పుర- సమీర్ (11), ఎన్టీఆర్ నగర్- సాయినిధి (3).
ఎమర్జెన్సీ నిధులతో వాక్సిన్ కొనుగోలు
ఆస్పత్రి ఎమర్జెన్సీ బడ్జెట్‌లో 20 శాతం నిధులను డిఫ్తీరియా వ్యాక్సిన్ కొనుగోలుకే వెచ్చించాల్సి వస్తోంది. ఒక్కో రోగికి 10 వేల యూనిట్లు ఇవ్వాల్సి వస్తోంది. ఇందు కోసం రూ.1500 ఖర్చవుతున్నాయి. ప్రభుత్వమే దీన్ని ఉచితంగా సరఫరా చేస్తే బాగుంటుంది.
- డాక్టర్ శంకర్, సూపరింటెండెంట్, ఫీవర్ ఆస్పత్రి
డిఫ్తీరియా కేసులు మరో పది..
Published Thu, Aug 29 2013 1:09 AM | Last Updated on Wed, Jun 13 2018 8:02 PM
Advertisement