ఎస్సీ వర్గీకరణతో రాష్ట్రంలోనే లబ్ధి: చెన్నయ్య | The classification of the SC state benefits: Chennayya | Sakshi
Sakshi News home page

ఎస్సీ వర్గీకరణతో రాష్ట్రంలోనే లబ్ధి: చెన్నయ్య

Published Mon, Aug 1 2016 1:15 AM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

ఎస్సీ వర్గీకరణతో రాష్ట్రంలోనే లబ్ధి: చెన్నయ్య - Sakshi

ఎస్సీ వర్గీకరణతో రాష్ట్రంలోనే లబ్ధి: చెన్నయ్య

సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణ జరిగితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విశ్వవిద్యాలయ సీట్లకు మాత్రమే వర్తిస్తుందని.. కేంద్ర ఉద్యోగాలు, విద్యాలయాల సీట్లకు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు వర్తించదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య స్పష్టం చేసారు. వర్గీకరణతో మాదిగలు ఒక శాతం లబ్ధి పొందవచ్చునేమో గానీ దేశవ్యాప్తంగా చమారులు, మహారులు, ఆంధ్రలో మాదిగలు నష్టపోతారని.. దళితులు, ఎస్టీ ఉపకులాల మధ్య వైషమ్యాలు, సంఘర్షణ పెరిగి దళితుల ఐక్యతకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

చమారులు, మహారులు, అరుంధతీయులు, మాయావతి (బీఎస్పీ), పాశ్వాన్ (లోక్ జన శక్తి), రాందాస్ అఠావలే(ఆర్పీఐ) వంటి వారు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. వర్గీకరణే పరిష్కారం కాదని సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పులో స్పష్టం చేసిందన్నారు. కాగా, వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్ష 11వ రోజుకు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement