హైదరాబాద్: ఓయూసెట్-2015 ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు రూ.300 అపరాధ రుసుముతో ఈ నెల 25 వరకు పొడిగించినట్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొ.గోపాల్‌రెడ్డి తెలిపారు. అపరాధ రుసుముతో ఈ నెల 22తో గడువు ముగిసినా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్లు పేర్కొన్నారు. ఇంత వరకు 1.4 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్‌సైట్లో చూడవచ్చు.