ఐదు నెలలుగా జీతాల్లేవు
రాష్ట్రం ఏర్పడ్డాక ఈ అంశంపై చర్చ జరుగుతున్నా ఆచరణలోకి రావట్లేదు. కాంట్రాక్టు అసిస్టెంట్ సర్జన్ల సర్వీసును ప్రతి ఏటా కొనసాగిస్తేనే వీరికి వేతనాలు అందు తాయి. వీరి కాంట్రాక్టు సర్వీసును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పొడిగించడంలో వైద్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో 307 మంది కాంట్రాక్టు వైద్యులకు 2017 మొదటి నుంచి వేతనాలు అందట్లేదు. 307 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్ల కాంట్రాక్టు సర్వీసును పొడిగిస్తూ జూలై 25న ఉత్తర్వులు జారీ చేసింది. 2018 మార్చి 31 వరకు వీరి సర్వీసు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఉత్తర్వులు విడుదలై 2 వారాలైనా ఇప్పటికీ వేతనాలు రాలేదు. వీరికి వేతనాలు చెల్లించక పోవడంతో గ్రామీణ పేదలకు అందే వైద్య సహాయంపై ప్రభావం పడుతోంది.