ఆండాళ్ నిలయంలో బస
* యాదగిరిగుట్టకు 6 కిలోమీటర్ల పరిధిలో ప్రత్యేక నిఘా
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానానికి ఆదివారం రాష్ర్టపతి ప్రణబ్‌ముఖర్జీ రానుండడంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. యాదగిరిగుట్ట చుట్టూ ఆరు కిలోమీటర్ల పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే ఐదారు మార్గాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. రాష్ట్రపతి ప్రత్యేక భద్రతా సిబ్బంది, సెంట్రల్ ఫోర్స్ పోలీసు లు శనివారం రాత్రి నుంచి యాదగిరిగుట్టను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకోనున్నారు.
భద్రతా కారణాల వల్ల ఆదివారం రోజున స్వామి వారికి భక్తులచే జరిపించే నిత్యపూజలు రద్దుచేశారు. రాష్ట్రపతికి ఆండాళ్ నిలయం అతిథిగృహంలో విడిది ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను శుక్రవారం రాష్ట్రపతి భద్రతా సిబ్బంది, నల్లగొండ కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ దుగ్గల్, ఈఓ గీతారెడ్డి పరిశీలించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయనకు అందించే ప్రసాదాలను నిష్ణాతులతో ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు.
రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు
Published Sat, Jul 4 2015 3:15 AM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM
Advertisement