
నేడు ఆటోల బంద్
రోడ్ సేఫ్టీ బిల్లు-2014పై నిరసన
జేఏసీ నాయకుల స్పష్టీకరణ
సుల్తాన్‌బజార్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోడ్ సేఫ్టీ బిల్లు-2014కు నిరసన గా శుక్రవారం ఆటోల బంద్‌కు ఆటో డ్రైవర్ల జేఏసీ పిలుపునిచ్చింది. హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు బి.వెంకటేశం(ఏఐటీయూసీ), కిరణ్ (ఐఎఫ్‌టీయూ), వేముల మారయ్య (టీఆర్‌ఎస్‌కేవీ), అమానుల్లాఖాన్ (టీఏడీజేఏసీ)లు ఈ వివరాలు తెలిపారు. రోడ్ సేఫ్టీ బిల్లు-2014 మోటార్ రంగంలో ఉన్న కార్మికులకు శాపంగా మారనుందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజూవారీగా ఆటోలు నడిపేవారి బతుకు భారమై పోతుందన్నారు. 8వ తరగతి చదువుకున్న వారే ఆటోలు నడపాలనే నిబంధన, ఈ-చలాన్లతో పాటు జీవో 108 మేరకు చలాన్ ఒక్కసారి రూ.100 నుంచి రూ.వెయ్యికి పెంచడం వంటివి ఆటో డ్రైవర్లకు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
చలానా కనీస మొత్తాన్ని రూ.5వేల నుంచి రూ.లక్షకు పెంచుతూ నరహంతక చట్టాన్ని తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి, రాష్ట్ర రవాణా శాఖ అధికారుల ఆంక్షలు, దాడులకు నిరసనగా శుక్రవారం ఒక్క రోజు ఆటో బంద్ పాటి ంచనున్నట్టు వారు తెలిపారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు జరిగే భారీ ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో పాల్గొని బంద్‌ను విజయవంతం చేయాలని ఆటోడ్రైవర్లకు పిలుపునిచ్చారు. ఈ బంద్‌లో స్కూల్ వ్యాన్ డ్రైవర్లు కూడా పాల్గొంటారని వారు తెలిపారు.