రాంగోపాల్‌పేట్: హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ‘హైడరేటర్’పేరుతో వందరోజుల పండుగలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రామకృష్ణ, కెప్టెన్ ఆనంద్, మనోజ్ చంద్రశేఖర్‌లు బుధవారం విలేకరులకు తెలిపారు. స్వాంతత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం శిల్పకళావేదికలో ఈ కార్యాక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.
గురువారం ఉదయం 7గంటలకు ఎబిలిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికలాంగ పిల్లలు వీల్‌చైర్స్‌తో చేసే సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది. నగరంలోని ప్రముఖ వేదికల్లో ప్రతి శనివారం ఒక కార్యక్రమం నిర్వహిస్తారు. శిల్పకళావేదిక, తాజ్ వివంతా, సికింద్రాబాద్ క్లబ్ ఒక్కో వీకెండ్ ఒక చోట నిర్వహిస్తారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జాషువా బ్యాండ్, రవిచారి క్రాసింగ్, పద్మశ్రీ శోభన నృత్యం, రోనూ ముజుందార్ సంగీత విభావరి, దశావతారం, మనోరంజన్ టాక్స్ ప్రీ హాస్య నాటిక వంటి విభిన్న సాంస్కృతి కార్యక్రమాల సమాహారమే ‘హైడరేట్’.
దేశంలోని ప్రముఖల చిత్రకళా ప్రదర్శన మూడు వారాలపాటు ప్రసాద్ ఐ మ్యాక్స్‌లో నిర్వహిస్తారు. స్పాట్ పెయింటింగ్స్ ఉంటాయి.నవంబర్ 23వ తేదీన శివమణి ఆద్వర్యంలో సంగీత కార్యక్రమం ఉంటుంది.‘హైడరేట్’ కార్యక్రమాలు ఉచితంగా వీక్షించవచ్చు. టికెట్లను ఎబిలిటీ ఫౌండేషన్‌లో పొందాలి. వివరాలకు040-66335533, 040-64646262 సంప్రదించాలి.
నేటి నుంచి ‘హైడరేట్’ వంద రోజుల పండుగ
Published Thu, Aug 15 2013 2:04 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM
Advertisement
Advertisement