నేడు నీళ్లు బంద్
సాక్షి, సిటీబ్యూరో: కృష్ణా మూడో దశ పైపులైన్లకు గుర్రంగూడ వద్ద ఏర్పడిన భారీ లీకేజీలకు మరమ్మతుల దృష్ట్యా ఈ నెల 20న (ఆదివారం) నగరంలోని వివిధ ప్రాంతాలకు మంచినీటి సరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఎల్‌బీనగర్, కాప్రా, ఉప్పల్, మల్కాజిగిరి, అల్వాల్ మున్సిపల్ ప్రాంతాల్లోని అన్ని కాలనీలకు నీటి సరఫరా పూర్తిగా కానీ పాక్షికంగా కానీ నిలిచిపోనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
‘డయల్ యువర్ ఎండీ’కి ఫిర్యాదులు
జలమండలి కార్యాలయంలో నిర్వహించిన మీట్ అండ్ డయల్ యువర్ ఎమ్‌డీ కార్యక్రమానికి 34 ఫిర్యాదులు అందాయి. కలుషిత జలాలు, అరకొర మంచినీటి సరఫరాపై వినియోగదారులు ఫిర్యాదులు చేశారు.
22న మరికొన్ని ప్రాంతాలకు...
సాహెబ్‌నగర్-మైలార్‌దేవ్‌పల్లి మార్గంలో పైపులైన్ లీకేజీలకు మరమ్మతుల కారణంగా ఈ నెల 22న ఉదయం 6 నుంచి 23వ తేదీ ఉదయం 6 గంటల వరకు అల్మాస్‌గూడ రాజీవ్ గృహకల్ప, బాలాపూర్ ఏఆర్‌సీఐ, బాబా నగర్, పిసల్ బండ, రైసత్‌నగర్, మోయిన్‌బాగ్, ఫతేషా నగర్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, మిధాని, డీఆర్‌డీఎల్, ఆర్‌సీఐ, సీఆర్‌పీఎఫ్, ఉప్పుగూడ, సాయిబాబా నగర్, శివాజీ నగర్, లలితాబాగ్, జీఎంనగర్ ప్రాంతాలకు మంచినీటి సరఫరా నిలిచిపోనుంది.