
నేడు, రేపు గోదావరి నీరు బంద్
దెబ్బతిన్న వాల్వ్ మరమ్మతుల కారణంగా బుధ, గురువారాల్లో వివిధ ప్రాంతాలకు గోదావరి జలాల సరఫరా ...
సిటీబ్యూరో: దెబ్బతిన్న వాల్వ్ మరమ్మతుల కారణంగా బుధ, గురువారాల్లో వివిధ ప్రాంతాలకు గోదావరి జలాల సరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి ఒక ప్రకటనలో తెలిపింది. కరీంనగర్ జిల్లా ముర్మూర్ వద్దనున్న పోట్యాల గ్రామంలో స్థానికులు వాల్వ్‌ను తొలగించి నీటిని వాడుకుంటున్నారని వెల్లడించింది. మరమ్మతులు చేపట్టేందుకు బుధవారం ఉదయం 6 నుంచి 18 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేయనున్నామని వివరించింది. దీంతో గురువారం వివిధ ప్రాంతాలకు ఆలస్యంగా నీటి సరఫరా జరిగే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు.
నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలివే...
ఎర్రగడ్డ, ఎల్లారెడ్డిగూడ, వెంగళరావు నగర్, యూసుఫ్‌గూడ, సోమాజిగూడ, వెంకటగిరి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బోరబండ, ఎస్పీఆర్‌హిల్స్ ఏరియా, సనత్‌నగర్, ప్రకాశ్‌నగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, బాలానగర్, భాగ్యనగర్, బాలాజీనగర్, ఎల్లమ్మబండ, మూసాపేట్, హస్మత్‌పేట్, హైదర్‌నగర్, నిజాంపేట్, ఆల్విన్‌కాలనీ, జగద్గిరిగుట్ట, ఆదర్శ్‌నగర్, షాపూర్‌నగర్, రోడామిస్త్రీ నగర్, హెచ్‌ఎంటీ కాలనీ, సూరారం, చింతల్, జీడిమెట్ల, సుభాష్‌నగర్, హఫీజ్‌పేట్, చందానగర్, మియాపూర్, ఆర్ సీపురం, అశోక్‌నగర్, బొల్లారం, శేరిలింగంపల్లి, మాదాపూర్.